Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దసరా సందర్భంగా వండర్‌లా హైదరాబాద్‌ ప్రత్యేకమైన ఆఫర్‌లు

wonderla

ఐవీఆర్

, శుక్రవారం, 4 అక్టోబరు 2024 (22:31 IST)
భారతదేశపు అతిపెద్ద అమ్యూజ్‌మెంట్ పార్క్ చైన్, వండర్‌లా హాలిడేస్ లిమిటెడ్, తమ వండర్‌లా హైదరాబాద్‌ పార్క్ వద్ద  అక్టోబర్ 10, 2024 వరకు ప్రత్యేకమైన దసరా ఆఫర్‌ను అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ సంతోషకరమైన దసరా సందర్భాన్ని పురస్కరించుకుని, ఆన్‌లైన్లో చేసే బుకింగ్‌ల కోసం ప్రత్యేకంగా "2 కొనండి- 1 ఉచితంగా పొందండి" టిక్కెట్ ఆఫర్‌ను వండర్‌లా అందిస్తోంది. ఈ పరిమిత-కాల ఆఫర్ కోసం బుకింగ్‌లను అక్టోబర్ 10 వరకు చేయవచ్చు, అక్టోబర్ 31 వరకు ఈ టిక్కెట్‌లు ఉపయోగించుకోవచ్చు..వినోదాత్మక అనుభవం కోసం మీ కుటుంబం, స్నేహితులను సమీకరించండి!
 
వండర్‌లా హైదరాబాద్‌ వద్ద ఉత్సాహ పూరితమైన వేడుకలలో భాగంగా, సందర్శకులు అక్టోబర్ 13 వరకు పార్క్‌లో దసరా ప్రత్యేక ఉత్సవాలను ఆస్వాదించవచ్చు, ఇందులో డీజే సెట్, ఉత్సాహపూరితమైన బతుకమ్మ ఉత్సవాలు, రంగురంగుల దసరా నేపథ్య ఊరేగింపు వంటి వాటితో పాటుగా  వేవ్ పూల్ వద్ద వినోదభరితమైన ఆటలను ఆస్వాదించవచ్చు. స్ట్రీట్ ఫుడ్ ఫెస్ట్‌లో పసందైన విందులు, రోజంతా ఆకర్షణీయమైన స్ట్రీట్ మ్యాజిక్ ద్వారా వినోదాన్ని పొందవచ్చు. దసరా ఉత్సాహాన్ని మరింత వున్నత స్థాయికి తీసుకువెళ్తూ, వండర్‌లా హైదరాబాద్ కూడా ఇటీవల హైపర్‌వర్స్ మరియు జి-ఫాల్ అంటూ రెండు కొత్త రైడ్‌లను ప్రవేశపెట్టింది, 
 
అంతేకాకుండా,ఈ పార్క్ ప్రత్యేకమైన 'ఫుడ్ కాంబోతో 2 టిక్కెట్‌లను కొనండి, ఫుడ్ కాంబోతో 1 టిక్కెట్‌ను ఉచితంగా పొందండి', ఇది చిరస్మరణీయమైన రోజు కోసం ఆనందకరమైన అనుభవాలు మరియు ఆహ్లాదకరమైన డైనింగ్ ఆప్షన్‌ల యొక్క ఖచ్చితమైన సమ్మేళనాన్ని సైతం నిర్ధారిస్తుంది. ఈ సంతోషకరమైన వేడుకల సందర్భంగా వండర్‌లా హాలిడేస్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె. చిట్టిలపిల్లి మాట్లాడుతూ, “వేడుకలు మరియు ఆత్మీయులను కలుసుకునేందుకు అత్యంత అనువైన సమయం దసరా. ఈ ఆనందకరమైన సంప్రదాయంలో భాగమైనందుకు మేము సంతోషిస్తున్నాము. మా ప్రత్యేక దసరా ఆఫర్ కేవలం రైడ్‌లు, ఆహారానికి మించినది-ఈ శుభ సమయంలో కుటుంబాలు, స్నేహితులు ఒకచోట చేరి మరిచిపోలేని జ్ఞాపకాలను పొందగలిగే స్థలాన్ని సృష్టించడం. ఈ వేడుక అందరి హృదయాలను సాహసం, ఆనందం మరియు ఉత్సాహంతో నింపుతుందని మేము ఆశిస్తున్నాము. దసరా స్ఫూర్తిని ఆలింగనం చేసుకోవడానికి, రాబోయే సంవత్సరాల్లో మధురానుభూతులుగా మిగిలే ప్రతిష్టాత్మకమైన క్షణాలను సృష్టించేందుకు అందరూ కలిసి రండి!"అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్తే అత్యాచారం చేస్తే నేరమా? కాదా? - పార్లమెంటులోనే నిర్ణయిస్తామని కేంద్రం కోర్టుకు ఎందుకు చెప్పింది