బీఎస్ఎన్ఎల్ ఫెస్టివల్ ఆఫర్స్.. రూ.500 కంటే ఎక్కువ రీఛార్జ్‌ చేస్తే?

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 13 January 2025
webdunia

బీఎస్ఎన్ఎల్ ఫెస్టివల్ ఆఫర్స్.. రూ.500 కంటే ఎక్కువ రీఛార్జ్‌ చేస్తే?

Advertiesment
bsnl logo

సెల్వి

, బుధవారం, 16 అక్టోబరు 2024 (12:02 IST)
పబ్లిక్ సెక్టార్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ కోసం ఫెస్టివల్ ధమాకా ఆఫర్‌ను ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ 24వ వార్షికోత్సవం సందర్భంగా కంపెనీ తన కస్టమర్లకు అత్యుత్తమ ఆఫర్లను అందిస్తోంది. గతంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.500 కంటే ఎక్కువ రీఛార్జ్‌ల కోసం 24 జీబీ అదనపు డేటా ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.
 
బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ. 499 అతి చిన్న ప్లాన్‌ను అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ ప్లాన్ రూ.100 తగ్గి రూ.399కి చేరుకుంది. కానీ ఈ మూడు నెలల తర్వాత బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.499 వసూలు చేస్తుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ 3300 జీబీ వరకు వినియోగానికి 60 ఎంబీపీఎస్ వేగాన్ని అందిస్తోంది.
 
బీఎస్​ఎన్​ఎల్​ సంస్థ రూ. 107 ప్లాన్​ని కూడా అందుబాటులోకి తెచ్చింది. దీని వాలిడిటీ 50 రోజులు! 3 జీబీ వరకు డేటాని పొందొచ్చు. 200 మినిట్స్​ వాయిస్​ కాల్స్​ ఫ్రీ. అయితే ఈ రీఛార్జ్​ ప్లాన్​లో ఎస్​ఎంఎస్​లు ఉచితంగా లభించడం లేదు. ఎస్​ఎంఎస్​ చేస్తే ఖర్చు అవుతుంది. ఇతర బెనిఫిట్స్​ ఏం లేవు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెన్నైలో కుంభవృష్టి.. అక్టోబర్ 17వరకు బలమైన గాలులు