Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీఎస్ఎన్ఎల్ కీలక నిర్ణయం.. 4జీ మొబైల్స్ తయారీ కోసం ఒప్పందం

Advertiesment
bsnl

ఠాగూర్

, గురువారం, 3 అక్టోబరు 2024 (09:54 IST)
భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ కస్టమర్ల సంఖ్యను మరింతగా పెంచుకునేందుకు వీలుగా, 4జీ మొబైల్స్‌ను అందుబాటులోకి తీసుకునిరావాలని భావిస్తుంది. ఇందుకోసం కార్బన్ మొబైల్స్ తయారీ కంపెనీతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. 
 
ఇటీవల దేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వీ (వొడా ఐడియా) తమ టారిఫ్ రేట్లను భారీగా పెంచేశాయి. దీంతో బీఎస్ఎన్ఎల్‌కు ఒక్కసారిగా ఆదరణ పెరిగింది. ఈ మధ్యకాలంలో చాలా మంది కస్టమర్లు బీఎస్ఎన్ఎల్లోకి పోర్ట్ అయ్యారు. దేశవ్యాప్తంగా సరసమైన రీఛార్జ్ ప్లాన్లను అందిస్తుండడమే ఇందుకు కారణంగా ఉంది. 
 
అదేసమయంలో 4జీ సర్వీసులను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చి... తద్వారా మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవాలని బీఎస్ఎన్ఎల్ యోచిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని చాలా మంది వినియోగదారులు ఇప్పటికీ ఫీచర్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. దీంతో ఫీచర్ ఫోన్లను వాడుతున్న కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా బీఎస్ఎన్ఎల్ కీలక ముందడుగు వేసింది.
 
భారత్ 4జీ విధానానికి అనుగుణంగా ప్రత్యేక సిమ్ హ్యాండ్సెట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రముఖ సెల్ఫోన్ల తయారీ కంపెనీ 'కార్బన్ మొబైల్స్'తో జతకట్టినట్టు ఎక్స్ వేదికగా బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఈ హ్యాండ్సెట్లు అందుబాటులోకి వస్తే ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు అవసరం లేకుండానే 4జీ సేవలను పొందవచ్చని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. కీలకమైన ఈ ఒప్పందంలో భాగంగా ప్రత్యేక సిమ్ హ్యాండ్సెట్లను అందుబాటులోకి తీసుకురానున్నామని ప్రకటించింది.
 
కార్బన్ మొబైల్స్‌తో కలిసి దేశంలో ప్రతి మూలకు సరసమైన 4జీ కనెక్టివిటీని అందించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, ఈ మేరకు కార్బన్ మొబైల్స్‌తో ఎంఓయూ కుదుర్చుకున్నామని ప్రకటనలో బీఎస్ఎన్ఎల్ తెలిపింది. కంపెనీ వ్యవస్థాపక దినోత్సవమైన అక్టోబరు ఒకటో తేదీన కీలక ప్రకటన చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంత్రి కొండా సురేఖకు మాజీ మంత్రి కేటీఆర్ డెడ్‌లైన్... సారీ చెప్పకుంటే..