Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అక్టోబర్ 1 నుంచి పీపీఎఫ్ పథకాల్లో కీలక మార్పులు.. అవేంటంటే?

PPF rules

సెల్వి

, మంగళవారం, 1 అక్టోబరు 2024 (17:02 IST)
PPF rules
అక్టోబర్ 1 నుంచి ఎన్నో కొత్త ఆర్థిక నిర్ణయాలు అమల్లోకి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రకటించింది. వాటిలో ఎలాంటి మార్పులు లేకపోయినా.. సుకన్య సమృద్ధి సహా పీపీఎఫ్ పథకాల్లో అక్టోబర్ 1 నుంచి కీలక మార్పులు వచ్చాయి.
 
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో.. సక్రమంగా లేని పబ్లిక్ ప్రావిడెంట్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లను క్రమబద్ధీకరించుకోవాల్సి వుంటుంది. ముఖ్యంగా ఇందులో పీపీఎఫ్ స్కీమ్‌లో.. మల్టిపుల్ అకౌంట్స్, మైనర్ అకౌంట్స్, ఎన్నారై అకౌంట్లకు సంబంధించినదిగా ఉండగా.. సుకన్య సమృద్ధి స్కీంలో అయితే గార్డియెన్‌షిప్ గురించి మార్పులొచ్చాయి. 
 
అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే అన్ని పోస్టాఫీసులు, బ్యాంకులు సహా ఇతర ఆర్థిక సంస్థలు అన్నీ సదరు అకౌంట్లు తెరిచేముందు కొత్త మార్గదర్శకాలు పాటించాలని పేర్కొంది. 
 
పీపీఎఫ్ కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ఒకటికి మించి ఒకరి పేరు మీద పీపీఎఫ్ అకౌంట్ తెరిస్తే.. అప్పుడు ప్రధాన అకౌంట్‌కు ప్రస్తుతం ఉన్న 7.10 శాతం వడ్డీ వస్తుంది. ఈ మార్పు ముఖ్య ఉద్దేశ్యం ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉన్నవారికి ఎలాంటి ప్రయోజనాలు అందించకపోవడం. ఇన్వెస్టర్లు వారి మొదటి అకౌంట్ నుంచి మాత్రమే ప్రయోజనం పొందగలరని పేర్కొంటుంది.   
 
అదనంగా ఉన్న అకౌంట్లకు లిమిట్ దాటితే వడ్డీ రాదు. ఎన్నారై  పీపీఎఫ్ అకౌంట్లపై ఎలాంటి వడ్డీ రాదు. 18 ఏళ్లు నిండిన తర్వాత ప్రామాణిక PPF వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ఈ మార్పు ముఖ్యమైనది ఎందుకంటే ఇది మైనర్‌లకు చిన్న వయస్సులోనే మరింత లాభదాయకమైన వడ్డీ రేట్ల నుండి ప్రయోజనం పొందేందుకు వీలు కల్పిస్తుంది. 
 
అదనంగా, ఈ ఖాతాల మెచ్యూరిటీ వ్యవధి మైనర్ మెజారిటీ సాధించిన తేదీ నుండి లెక్కిస్తుంది. దీంతో వారు ఎదిగే కొద్దీ ఆర్థిక నిర్వహణ సులభతరం అవుతుంది. వీటికి తోడు.. సుకన్య సమృద్ధి పథకంలో కూడా కీలక మార్పులు చేసింది కేంద్రం. ఈ స్కీమ్ కింద ఇంట్లో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల పేరిటే అకౌంట్ తెరిచేందుకు వీలుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో రోడ్ల మరమ్మత్తు కోసం రూ.10,000 కోట్లు మంజూరు