అక్టోబర్ 2వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడనుంది. సూర్య గ్రహణానికి 12 గంటల ముందు నుంచి సూత కాలం ప్రారంభమవుతుంది. ఈ గ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తారు. సూర్యుడి చుట్టూ ఎర్రటి వలయాకారం ఏర్పడుతుంది.
సూర్యగ్రహణం సమయంలో పూజ, శుభకార్యాలు వంటి చేయరాదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్టోబరు 2న ఏర్పడనున్న సూర్యగ్రహణం వల్ల రెండు రాశుల వారికి ఇబ్బందులు తప్పవంటున్నారు.
సర్వపితృ అమావాస్య రోజున అంటే అక్టోబర్ 2 న ఏర్పడనున్న సూర్యగ్రహణం కన్య రాశిలో ఏర్పడనుంది. దీంతో కన్య , మీన రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా కన్య రాశికి చెందిన వ్యక్తులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు.
అదే సమయంలో మీన రాశిలో రాహువు సంచరిస్తున్నాడు. కనుక ఈ గ్రహణ ప్రభావం ఈ రాశివారిపై చూపనుంది. కనుక కన్య, మీన రాశికి చెందిన వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.