శుక్రవారాల్లో తెల్లని వస్త్రాలు ధరించడమే కాదు శ్రీలక్ష్మి అనుగ్రహం కోసం పాలతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. లక్ష్మీదేవికి కుంకుమపువ్వుని లేదా బియ్యంతో పాయసం చేసి నైవేద్యంగా పెట్టవచ్చు. పాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించవచ్చు. 
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	శుక్రవారం రోజున తులసి మొక్కను, శాలిగ్రామాలను పూజించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి చాలా సంతోషించి, కోరుకున్న వరాన్ని ఇస్తుంది. తులసి మొక్క దగ్గర ఉదయం, సాయంత్రం నెయ్యి దీపం వెలిగించాలి. 
 
									
										
								
																	
	 
	శుక్రవారం రోజున లక్ష్మీనారాయణ రూపాన్ని పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. శుక్రవారం రోజున స్త్రీలు, పసుపు, కుంకుమ, పువ్వులను ధరించాలి. అలాగే గోరింటాకు పెట్టుకోవడం శుభ ఫలితాలను ఇస్తుంది.