Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంత్రి కొండా సురేఖకు మాజీ మంత్రి కేటీఆర్ డెడ్‌లైన్... సారీ చెప్పకుంటే..

ktrao

ఠాగూర్

, గురువారం, 3 అక్టోబరు 2024 (09:43 IST)
తన గురించి అసత్యపూరితమైన ఆరోపణలు చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ 48 గంటల డెడ్‌లైన్ విధించారు. తనపై చేసిన అసత్య ఆరోపణలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఇదే అంశంపై మంత్రి సురేఖకు మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు కూడా పంపించారు. 
 
తనకు ఏ మాత్రం సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్‌‍తో పాటు, ఇతర అంశాలపై కొండా సురేఖ అబద్ధాలు మాట్లాదారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గౌరవానికి భంగం కలిగించేలా తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. సాక్ష్యాలు లేకుండా అసత్యాలు మాట్లాదారని దుయ్యబట్టారు.
 
గతంలో కూడా తన గురించి ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని... ఆ వ్యాఖ్యలపై ఏప్రిల్ లో నోటీసులు పంపించానని కేటీఆర్ చెప్పారు. చట్ట పరంగా తాను స్పందించకుంటే... ఆమె చేసిన వ్యాఖ్యలు నిజమని ప్రజలు భావించే ప్రమాదం ఉందని అన్నారు. తనకు కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలని... లేకపోతే పరువునష్టం దావాతో పాటు క్రిమినల్ కేసులు వేస్తానని హెచ్చరించారు.
 
కేటీఆర్ వల్ల కొందరు హీరోయిన్లు ఇబ్బంది పడ్డారని... కొందరు త్వరగా పెళ్లి చేసుకుని, ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నారని కొండా సురేఖ అన్నారు. నాగార్జున కుటుంబంలో చోటుచేసుకున్న పరిణామాలకు... సమంత, నాగచైతన్య విడిపోవడానికి కూడా కేటీఆరే కారణమని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేపాల్‌లో భారీ వరదలు-పశుపతినాధ్ ఆలయం వరద.. 240మంది మృతి (video)