Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలి: నటి ఖుష్బూ

Advertiesment
khushboo

ఠాగూర్

, గురువారం, 3 అక్టోబరు 2024 (09:28 IST)
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత, నటి కుష్బూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా సినీ పరిశ్రమ గురించి బాధ్యత రాహిత్యమైన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సినీ పరిశ్రమ ఇకపై ఇలాంటి వాటిని సహించబోదని, మొత్తం సినీ పరిశ్రమకు సురేఖ క్షమాపణ చెప్పాలని ఆమె ట్వీట్ చేశారు. 
 
'రెండు నిమిషాల ఫేమ్, ఎల్లో జర్నలిజంలో మునిగిపోయే వారు మాత్రమే ఇలాంటి భాష మాట్లాడతారని అనుకున్నాను. కానీ ఇక్కడ స్త్రీత్వానికి ఘోర అవమానాన్ని చూస్తున్నాను. కొండా సురేఖ గారూ, మీలోని విలువలు ఏమైపోయాయి? బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీరు సినీ పరిశ్రమపై ఇలాంటి నిరాధారమైన, భయంకరమైన, కించపరిచే ప్రకటనలు చేయరాదు. ఇలాంటి ఆధారంలేని ఆరోపణలు చేస్తే సినీ పరిశ్రమ చూస్తూ కూర్చోదు. ఇలాంటి నిరాధారమైన, తప్పుడు ఆరోపణలకు మీరు మరొక మహిళకు మహిళగా, మొత్తం సినీ పరిశ్రమకు క్షమాపణ చెప్పాలి" అంటూ ఖుష్బూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
అలాగే, హీరో నాని కూడా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. "తాము ఏం మాట్లాడినా తప్పించుకోవచ్చని రాజకీయ నాయకులు అనుకోవడం చూస్తుంటే అసహ్యం వేస్తుంది. మీ మాటలే ఇలా బాధ్యతారహితంగా ఉన్నప్పుడు, ప్రజల పట్ల మీకు బాధ్యత ఉంటుందని ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది. ఇది కేవలం నటులు లేదా సినిమా గురించి కాదు. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించినది కాదు. ఇంత గౌరవప్రదమైన హోదాలో ఉన్న వ్యక్తి మీడియా ముందు ఇలా నిరాధారమైన మాటలు మాట్లాడడం సరైంది కాదు. సమాజానికి చెడుగా ప్రతిబింబించే ఇలాంటి వాటిని అందరూ ఖండించాలి" అని నాని ట్వీట్ చేశారు.
 
అక్కినేని అఖిల్ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని అమల చేసిన ట్వీటు ఆమె కుమారుడు, యువ నటుడు అఖిల్ స్పందించారు. "అమ్మ.. మీ ప్రతి మాటకు నేను మద్దతు ఇస్తున్నాను. ఇలాంటి ని విషయంపై మీరు స్పందించాల్సి రావడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. కానీ కొన్నిసార్లు ఇలాంటి సామాజిక విద్రోహుల వ్యాఖ్యలపై స్పందించడం తప్ప మనకు వేరే మార్గం లేదు" అని అఖిల్ తన ట్వీట్లో పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు బాధించాయి : చిరంజీవి