Webdunia - Bharat's app for daily news and videos

Install App

జస్టిస్ ఘోష్ కమిషన్‌ ముందుకు మాజీ సీఎం కేసీఆర్.. అరెస్టు తప్పదా?

ఠాగూర్
బుధవారం, 11 జూన్ 2025 (10:08 IST)
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ విచారణలో భాగంగా, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విచారణ కమిషన్ ముందు బుధవారం హాజరుకానున్నారు. ఈ విచారణలో భాగంగా, జస్టిస్ ఘోష్ కమిషన్ ఇదివరకే పలువురు అధికారులు, నిర్మాణ సంస్థలు ప్రతిధులు, అప్పటి మంత్రులను విచారించింది. తాజాగా ఈ రోజు మాజీ ముఖ్యమంత్ర కేసీఆర్‌ను విచారించనుంది. 
 
మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సీపేజీ సమస్యలు తలెత్తిన నేపథ్యంలో గత యేడాది మార్చిలో సుప్రీంకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్‌తో ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటుచేసిన విషయంతెల్సిందే. 
 
ఈ క్రమంలో కమిషన్ బ్యారేజీ నిర్మాణ ఇంజనీర్లు, నీటిపారుదల శాఖ, ఆర్థిక శాఖలకు చెందిన అధికారులను, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించనుంది. వారి అఫిడవిట్లు స్వీకరించి, క్రాస్ ఎగ్జామినేషన్‌ను సైతం పూర్తి చేసింది. ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, నీటి పారుదల శాఖ మాజీ మంత్రి హరీశ్ రావులను కూడా కమిషన్ విచారించింది. 
 
ఈ విచారణ కోసం బుధవారం ఉదయం 11 గంటలకు బూర్గుల రామకృష్ణరావు భవన్‌లో జస్టిస్ ఘోష్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్‌ను విచారించింది. ఇప్పటివరకు మీడియా, కమిషన్‌లోని ఇంజనీర్ల సమక్షంలో విచారణ జరిపిన కమిషన్, కేసీఆర్ విషయంలోనూ అదే విధానాన్ని అనుసరిస్తుందా, లేక కేవలం కమిషన్ అధికారుల సమక్షంలోనే ఇక కెమెరా విచారణ జరుపుతుందా అదే అంశంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు, కేసీఆర్ రాక సందర్భంగా బూర్గుల భవనం వద్ద 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జటాధర లో శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌ చేసింది : నిర్మాత ప్రేరణ అరోరా

Sudeep: కిచ్చా సుదీప్ పాన్ ఇండియా మూవీ మార్క్ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

ఉత్తర్ ప్రదేశ్ నేపథ్యంలో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో నిశాంచి ట్రైలర్ విడుదల

Anupama : దెయ్యంలా వుంటావని అమ్మ తిడుతుండేది : అనుపమ పరమేశ్వరన్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

తర్వాతి కథనం
Show comments