Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

ఠాగూర్
ఆదివారం, 8 జూన్ 2025 (17:47 IST)
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) ఆదివారం మృతిచెందారు. మూడు రోజుల క్రితం తీవ్రమైన గుండెపోటుకు గురైన ఆయన, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని, ఇటీవల ఆపరేషన్ కూడా చేయించుకున్నారని తెలిసింది. 
 
గోపీనాథ్ మరణవార్త తెలియగానే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. మాదాపూర్‌లోని డాక్టర్స్ కాలనీలో ఉన్న గోపీనాథ్ నివాసానికి చేరుకున్నకేసీఆర్, ఆయన పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ తీవ్ర భావోద్వేగానికిగురై కంటతడి పెట్టారు. 
 
గోపీనాథ్ కుటుంబ సభ్యులను ఓదార్చిన కేసీఆర్, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీశ్ రావు, ఎంపీ రవిచంద్ర తదితరులు కూడా గోపీనాథ్ నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. 
 
అంతకుముందు, గోపీనాథ్ మృతిపట్ల కేసీఆర్ ఒక ప్రటనలో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలయజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments