Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు కుమార్తెలను చంపి పరారైన దంపతులు ఆత్మహత్య.. ఎక్కడ?

వరుణ్
శుక్రవారం, 12 ఏప్రియల్ 2024 (09:48 IST)
గతంలో రెండేళ్ల కుమార్తెను చంపి పరారైన దంపతులు ఇపుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గూడెంకు చెందిన అనిల్, దేవి అనే దంపతులు గతంలో తమ కుమార్తెకు పురుగుల మందు ఇచ్చి హత్య చేసి అక్కడ నుంచి పారిపోయారు. 
 
తాజాగా వారు అంకన్నగూడెం శివారు ప్రాంతానికి చేరుకుని ఓ చెట్టుకు ఉరేసుకుని కనిపించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఈ దంపతుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కుమార్తెను చంపిన కేసులో తమకు అరెస్టు, శిక్ష తప్పదని భావించడం వల్లే వారు ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. 
 
త్రిపుర సుందరి ఆలయంలో షార్ట్ వీడియోల చిత్రీకరణకపై నిషేధం!! 
 
రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌లోని త్రిపుర సుందరి ఆలయంలో షార్ట్ వీడియోస్ చిత్రీకరణపై నిషేధం విధించింది. ఆలయ ప్రాంగణంలో అభ్యంతరకరరీతిలో చిత్రీకరించిన వీడియోలు వైరల్ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆలయ అధికారులు.. ఇకపై షార్ట్ వీడియోల చిత్రీకరణను నిషేధిస్తూ ఆదేశాలు జారీచేశారు. పైగా, ఈ నిషేధాజ్ఞలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 
భారత ఉపఖండంలోని 51 శక్తిపీఠాల్లో త్రిపుర సుందరి ఆలయం ఒకటన్న విషయం తెలిసిందే. ఆలయ ప్రాంగణం కూర్మాకారంలో ఉండటంతో ఈ ఆలయం కూర్మపీఠంగా ప్రసిద్ధికెక్కింది. ఆలయంలో బౌద్ధ స్తూప లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఆలయ ప్రధాన ద్వారం దక్షిణానికి అభిముఖంగా ఉండటం ఈ ఆలయం మరో ప్రత్యేకత. ఉత్తర దిక్కున కూడా ఓ చిన్న ప్రవేశద్వారం ఉంది. మధ్యయుగాల నాటి బెంగాలీ ఛార్ చాలా నిర్మాణ శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించారు.
 
ధాన్య మాణిక్య అనే రాజు 1501లో ఈ దేవాలయాన్ని నిర్మించారు. తొలుత విష్ణువు కోసం ఆలయం నిర్మించినప్పటికీ రాజుకు కలలో అమ్మవారు కనిపించడంతో ఆయన శక్తి పీఠాన్ని ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్‌లోని చట్టగాంగ్‌ నుంచి తెప్పించిన కస్తి శిలతో విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. అలాంటి స్థల పురాణం కలిగిన ఈ ఆలయ ప్రాంగణంలో అభ్యంతరకర రీతిలో తీసిన ఓ షార్ట్ వీడియో ఇటీవల వైరల్ అయింది. 'ఆలయంలో అసభ్యకర పాటలు, నృత్యాలతో షార్ట్ వీడియోలు, రీల్స్ తీయడంపై నిషేధం విధించాం. ఆలయం బ్యాక్‌గ్రౌండ్‌గా వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి ప్రజల మనోభావాలను దెబ్బతీయొద్దు' అని అధికారులు నోటీసు విడుదల చేశారు. నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments