కన్నకూతురును గొంతుకోసి చంపేశాడో కసాయి తండ్రి. ఈ ఘటనలో కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కర్నూలు కోసిగి మండలం జంపాపురంకు చెందిన మద్యానికి బానిసైన శాంతికుమార్ కొంతకాలంగా సైకోగా ప్రవర్తిస్తున్నట్లు తెలిసింది. 
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	బుధవారం ఉదయం తల్లి పక్కన పడుకున్న పాపను అతి కిరాతకంగా గొంతు కోసి కడతేర్చాడు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం చిన్నారిని గొంతు కోసి చంపేశాడు. నిద్రలేచి చూసేసరికి కూతురు రక్తపుమడుగులో పడి ఉండడంతో తల్లి సంపూర్ణ పోలీసులకు సమాచారం అందించింది. 
 
									
										
								
																	
	 
	దీంతో ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు శాంతి కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.