Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మరికొన్ని గంటల్లో పెళ్లి... కొడుకుని 15 సార్లు కత్తితో పొడిచి చంపేసిన తండ్రి...

Advertiesment
murder

ఠాగూర్

, శుక్రవారం, 8 మార్చి 2024 (15:13 IST)
మరికొన్ని గంటల్లో పెళ్లికావాల్సిన వరుడు దారుణ హత్యకు పాల్పడ్డాడు. ఈ హత్య చేసింది కూడా కన్నతండ్రే కావడం గమనార్హం. దీంత ఆ ఇంట విషాదం నెలకొంది. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీకి చెందిన గౌరవ్‌ సంఘాల్‌ (29) అనే యువకుడు జిమ్ నడుపుతున్నాడు. గురువారం అతనికి వివాహం జరగాల్సివుంది. మరికొన్ని గంటల్లో పెళ్లి జరగనుండగా తండ్రీ కొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది తీవ్ర స్థాయికి చేరింది. ఒక దశలో నిగ్రహం కోల్పయిన కన్నతండ్రి రంగలాల్... ఆగ్రహంతో కుమారుడిని 15సార్లు కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం పారిపోయాడు. 
 
సంగీత వాయిద్యాల చప్పుడు ఎక్కువగా ఉండడంతో ఈ విషయాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు. వివాహ ఊరేగింపు కోసం వరుడిని వెతుకుతున్న బంధువులకు అతడు రక్తపు మడుగులో కనిపించడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ యువకుడు మరణించాడని, గాలింపు చర్యల అనంతరం అతని తండ్రిని అదుపులోకి తీసుకున్నామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంకిత్ చౌహాన్ తెలిపారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు హత్య చేసినట్లుగా అంగీకరించడంతో అతడిని శుక్రవారం అరెస్టు చేశామని పేర్కొన్నారు. తదుపరి విచారణ కొనసాగుతోందన్నారు.
 
కరీంనగర్ ఎంపీగా మళ్లీ గెలిస్తే భారాస దుకాణం మూసేస్తారా? కేటీఆర్‌కు బండి సంజయ్ సవాల్.. 
 
గుడ్డిలో మెల్లగా కరీంనగర్ ఎంపీగా గెలిచారంటూ తన గురించి భారత రాష్ట్ర సమితి నేతలు చేస్తున్న ప్రచారం, కామెంట్స్‌పై కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ సవాల్ విసిరారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను మళ్లీ కరీంనగర్ ఎంపీగా గెలిస్తే భారత రాష్ట్ర సమితి దుకాణం మూసివేస్తారా అని ప్రశ్నించారు. అలాగే, ఒకవేళ తాను ఆ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, తాను గెలిస్తే కేసీఆర్, కేటీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమవుతారా అని నిలదీశారు. 
 
తాను చేపట్టిన ప్రజాహిత యాత్రలో కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. చొప్పదండి అంబేడ్కర్ చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్ అభివృద్ధిపై కేటీఆర్ చేసిన సవాలును స్వీకరిస్తున్నానని అన్నారు. చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, కేసీఆర్‌ను కూడా తీసుకు రావాలని అన్నారు. మహారాష్ట్రలో పార్టీ ఆఫీస్ తెరచి అద్దె చెల్లించకుండా అక్కడి నేతలను మోసం చేశారని కేసీఆర్, కేటీఆర్లపై సంజయ్ ఆరోపించారు. 
 
మరో వ్యక్తి గురించి మాట్లాడేటపుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేనిపక్షంలో కరీంనగర్‌లో అడుగుపెట్టనీయబోమని హెచ్చరించారు. బండి సంజయ్ ఎప్పుడూ రాముడి పేరు చెబుతుంటారని తనను విమర్శిస్తున్నారని, రాముడి పేరు కాకపోతే రావణుడి పేరు చెప్పాలా? అని ప్రశ్నించారు. బండి సంజయ్ వెంట మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, పలువురు బీజేపీ నేతలు ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజ్యసభకు సుధామూర్తి నామినేట్... రాష్ట్రపతి సిఫారసు