తెలంగాణను వణికిస్తున్న చలి.. ఆరెంజ్ అలెర్ట్.. ఆరోగ్యం జాగ్రత్త

సెల్వి
గురువారం, 13 నవంబరు 2025 (09:39 IST)
తెలంగాణను చలి వణికిస్తోంది. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో చలి మరింత తీవ్రం కానుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇందులో భాగంగా పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లను జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతున్నాయి. తద్వారా చలి తీవ్రతకు తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 
 
వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం రానున్న రోజుల్లో రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు 8.5 డిగ్రీల నుంచి 12.5 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువకు పడిపోవచ్చని తెలిపింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో సిర్పూర్ (కుమురం భీమ్) వద్ద 10.2°C అత్యల్ప అధికారిక కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో, నవంబర్ 13-18 మధ్య నగరంలోని పశ్చిమ, ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో 11°C, 13°C మధ్య అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
 
ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీ మహిళలు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఈ చల్లటి  వాతావరణానికి గురికాకుండా ఉండాలని, చలిని ఎదుర్కునే దుస్తులు ధరించాలని అధికారులు సూచించారు. రబీ పంటలు, పశువులను చలి ఒత్తిడి నుండి రక్షించాలని రైతులను కోరారు. ఐఎండీ ప్రకారం, ఈ చలి ప్రభావం నవంబర్ 17 వరకు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి.
 
ఈ చలి కారణంగా ప్రజలు అనారోగ్య సమస్యలను ఎదుర్కునే అవకాశం వుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చల్లని వాతావరణంలో రోగ నిరోధక శక్తి మందగించడం వల్ల వైరస్‌లు సులభంగా వ్యాప్తి చెందుతాయని, దీనివల్ల న్యూమోనియా, ఇతర శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయని వివరిస్తున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున కొన్ని వర్గాల వారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments