Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖామంత్రిగా అజారుద్దీన్

Advertiesment
azaruddin

ఠాగూర్

, సోమవారం, 10 నవంబరు 2025 (18:38 IST)
తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖామంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ సోమవారం తన శాఖా బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో ముస్లిం మత పెద్దల ప్రార్థనల మధ్య ఆయన బాధ్యతలు చేపట్టారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనపై ఎంతో నమ్మకం ఉంచి ఈ గురుతర బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు. సీఎం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేంలా పని చేస్తానని స్పష్టం చేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్‌కు పలువురు అధికారులు, నేతలు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. 
 
గత నెల 13వ తేదీన అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెల్సిందే. రాజ్‌భవన్‌లో ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత అజారుద్దీన్‌కు మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖలను అప్పగించారు. తాజాగా ఆయన ఆయా శాఖల బాధ్యతలను స్వీకరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంక్రాంతి సందడి : రైళ్ళన్నీ ఫుల్.. వందేభారత్‌కు వెయిటింగ్