Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం రేవంత్‌ రెడ్డితో సమావేశమైన ఆర్బీఐ మాజీ గవర్నర్

Webdunia
ఆదివారం, 17 డిశెంబరు 2023 (18:02 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భారత రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆదివారం భేటీ అయ్యారు. ఈ సంద్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధిపై చర్చించారు. ఇందులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా రఘరామ రాజన్ వ్యవహరించారు. 
 
కాగా, తన నివాసానికి వచ్చిన రఘురాం రాజన్‌ను సీఎం రేవంత్ రెడ్డి ముందుగా శాలువాతో సత్కరించారు. భట్టి, శ్రీధర్ బాబులతో కలిసి బొకేతో రాజన్‌ను స్వాగతించారు. ఆ తర్వాత రాష్ట్రంలో ఆర్థిక సమస్యలపై చర్చించినట్టు సమాచారం. నిధుల సమీకరణకు అనుసరించాల్సిన విధి విధానాలపై రఘురాం రాజన్ సూచనలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో సీఎం, ముత్రులతో పాటు ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి తదితరులు ఆరోపించారు. 

మూడు రంగుల జెండా మూడు చక్రాల ఆటో కార్మికుల పొట్టకొట్టింది.. ఆటో డ్రైవర్లు 
 
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కొత్త మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నిక హామీల్లో భాగంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. అయితే, ఈ ఉచిత బస్సు ప్రయాణం తమ పొట్టికొట్టిందంటూ తెలంగాణాలోని అనేక ఆటోల సంఘాల ఆందోళన చేస్తున్నారు. మూడు రంగాల జెండా మూడు చక్రాల ఆటో డ్రైవర్ల పొట్టి కొట్టిందని వారు ఆరోపిస్తున్నారు. 
 
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేసిన పథకం ఆటో కార్మికులకు నష్టం చేసిందన్నారు. వివిధ జిల్లాల్లో ఆందోళన చేసిన ఆటో డ్రైవర్లు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుచోట్ల ర్యాలీలు నిర్వహించారు. సిద్దిపేట, మెదక్, జగిత్యాల తదితర జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా ఆయా చోట్ల ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ... మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల తమకు ఉపాధి తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేటలో ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 
 
అధ్యక్షుడు సాయిరామ్ మాట్లాడుతూ... తాము బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఆటోలను నడిపిస్తున్నామని, ఇప్పుడు ఈ పథకం వల్ల పూట గడవని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒకవైపు ఆటో ఈఎంఐలు, మరోవైపు కుటుంబ పోషణ భారంగా మారుతోందన్నారు. మూడు రంగుల జెండా మూడు చక్రాల ఆటో జీవితాల్లో చీకటిని నింపిందన్నారు. లక్షలాది ఆటో కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయన్నారు. 
 
కార్మికుల ఆటో కార్మికుల జీవితం కోసం ఈ పథకంపై కాంగ్రెస్ పునరాలోచన చేయాలని పలువురు విజ్ఞప్తి చేశారు. లేదంటే ఆటో కార్మికులకు నెలకు రూ.15 వేల భృతిని అందించాలని డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments