Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యాంటు జేబులో పేలిన మొబైల్... తొడకు గాయాలు...

ఠాగూర్
శుక్రవారం, 4 జులై 2025 (17:29 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడికి ఊహించని ప్రమాదం ఎదురైంది. అతని ఫ్యాంటు జేబులో పెట్టుకున్న మొబైల్ ఫోన్ ఒకటి పెద్ద శబ్దంతో పేలిపోయింది. దీంతో ఆ యువకుడికి గాయాలయ్యాయి.
 
రాజేంద్ర నగర్ పరిధిలోని అత్తాపూర్‌కు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు పెయింటర్‌గా పని చేస్తున్నాడు. రోజులాగే తన స్మార్ట్‌ఫోన్‌ను ఫ్యాంటు జేబులో పెట్టుకుని పనికి వెళుతుండగా, ఫోన్ ఒక్కసారిగా తీవ్రంగా వేడెక్కింది. క్షణాల్లోనే దాని నుంచి మంటలు వ్యాపించి దుస్తులకు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన శ్రీనివాస్‌ ఫోనును జేబులో నుంచి బయటకు తీసినప్పటికీ అప్పటికే అతని తొడకు మంటలు తగిలి చర్మం కాలిపోయింది. 
 
దీన్ని గమనించిన స్థానికులు హుటాహుటిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. తొడపై చర్మం కాలిపోయిందని, శ్రీనివాస్ వెంటనే స్పందించడం వల్ల పెను ప్రమాదం తప్పిందని వైద్యులు అంటున్నారు. కాస్త ఆలస్యమైతే గాయం కండరాల వరకు వెళ్లి ఉండేదని వారు వివరించారు. 
 
కాగా, ఇటీవలికాలంలో ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. మే నెలలో అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఓ బీటెక్ విద్యార్థి జేబులో ఫోన్ పేలి తీవ్రంగా గాయపడగా, యూపీలోనూ ఓ యువకుడి ఐఫోన్ పేలిపోయింది. ఫోన్‌ను అతిగా చార్జింగ్ చేయడం, బ్యాటరీ దెబ్బతినడం వంటి కారణాల వల్లే పేలుళ్లు సంభవిస్తాయని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: తమన్నా భాటియా, డయానా పెంటీ నటించిన డూ యు వాన్నా పార్టనర్ రాబోతుంది

ది గర్ల్ ఫ్రెండ్ లో ఏం జరుగుతోంది.. అంటూ చెబుతున్న రశ్మిక మందన్న

GAMA: గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫామర్ గా ఫరియా అబ్దుల్లా

Vishal: సముద్రం మాఫియా కథ తో విశాల్ 35వ చిత్రం మకుటం

balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో నందమూరి బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

తర్వాతి కథనం
Show comments