ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కవిత.. తండ్రిని చూసి భావోద్వేగం.. కాళేశ్వరం విచారణకు కేసీఆర్

సెల్వి
బుధవారం, 11 జూన్ 2025 (09:47 IST)
KCR_Kavitha
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ తనయ కవిత తన తండ్రిని కలిశారు. ఇక హరీశ్ రావు కూడా నిన్నటి నుంచి ఫాంహౌస్‌లోనే ఉన్నారు. మరికాసేపట్లో కేసీఆర్ కాళేశ్వరం విచారణకు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా తండ్రి కేసీఆర్‌ని చూసి కవిత భావోద్వేకానికి గురైంది. భర్త అనిల్‌తో కలిసి కవిత ఫాంహౌస్‌కు వచ్చింది. కాళేశ్వరం కమిషన్‌ విచారణకు ముందు భేటీపై ఉత్కంఠ రేపుతుంది. 
 
ఇకపోతే.. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ అంశంపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇదివరకే పలువురు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, అప్పటి మంత్రులను విచారించింది. తాజాగా, బుధవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విచారించనుంది.
 
మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సీపేజీ సమస్యలు తలెత్తిన నేపథ్యంలో, గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్‌తో ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం విదితమే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: యుద్దం నేపథ్యంలో శంబాల ట్రైలర్‌.. ఆవిష్కరించిన ప్రభాస్

Allari Naresh: ప్రేమ, థ్రిల్ ఎలిమెంట్స్ తో అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ

Bhagyashree Borse: నక్షత్రాల మధ్య ఆటలాడుతూ, వెన్నెల్లో తేలియాడుతూ.. రామ్, భాగ్యశ్రీ బోర్సే

Mass Jatara Review: జరుగుతున్న కథతో ఫ్యాన్స్ ఫార్ములాగా మాస్ జాతర - మూవీ రివ్యూ

Allu Sirish and Nayanika: నయనిక రెడ్డితో అల్లు శిరీష్.. తారల సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments