Raj Tarun, Lavanya: లావణ్యకు బిగ్ షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ఏంటది?

సెల్వి
శుక్రవారం, 27 జూన్ 2025 (12:42 IST)
హీరో రాజ్ తరుణ్ - లావణ్యల ఎపిసోడ్ గత ఏడాది నుంచి ఎంతటి హాట్ టాపిక్‌గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. అన్ని విధాలుగా వాడుకుని వదిలేసి వేరే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడంటూ లావణ్య మొదట్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు లావణ్యకు బిగ్ షాకిచ్చింది. రాజ్‌ ఇంట్లో ఉండేందుకు లావణ్యకు అర్హత లేదని తెలిపింది. అంతేకాకుండా లావణ్య, రాజ్‌ తరుణ్ భార్య అనడానికి ఎలాంటి ఆధారం లేదని పేర్కొంది. వీటితో పాటు ఆ ఇల్లు లావణ్యదని ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. 
 
అందువల్ల రాజ్ తరుణ్ ఇంట్లో ఉండేందుకు లావణ్యకు ఎలాంటి అధికారం లేదని వెల్లడించింది. ఇక లావణ్యకు ఎలాంటి పోలీస్‌ ప్రొటెక్షన్‌ ఇవ్వడం కుదరదని తెలంగాణ హైకోర్టు తెలిపింది. ఇంకా ఏమైనా కేసులు ఉంటే సివిల్‌ కోర్టులో తేల్చుకోవాలని.. ఇక్కడ టైం వేస్ట్ చేయొద్దంటూ లావణ్యకు కోర్టు చురకలు అంటించింది. 
 
గత కొన్ని నెలలుగా కోకాపేటలోని పుప్పాలగూడలో ఉన్న రాజ్ తరుణ్ ఇంటి విషయంలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే కేసును విచారించిన తెలంగాణ హైకోర్టు లావణ్యకు షాక్ ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments