Bengaluru : ఫ్రెండ్స్‌తో గొడవ.. రీల్స్ చేద్దామని 13 అంతస్థుకు వెళ్లింది.. జారిపడి యువతి మృతి

సెల్వి
శుక్రవారం, 27 జూన్ 2025 (12:14 IST)
Bengaluru Girl
బెంగళూరులోని పరప్పన అగ్రహార ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం 13వ అంతస్థు నుంచి పడి 20 ఏళ్ల యువతి మృతి చెందింది. రీల్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతురాలు బీహార్‌కు చెందిన యువతిగా గుర్తించారు. 
 
నగరంలోని ఓ షాపింగ్‌ మాల్‌లో పనిచేస్తున్న ఆమెకు రీల్స్ పిచ్చి ఎక్కువ. బుధవారం రాత్రి కొందరు స్నేహితులతో కలిసి ఆమె ఆ నిర్మాణంలో ఉన్న భవనానికి లేట్ నైట్ పార్టీ కోసం వెళ్లింది. 
 
పార్టీ తర్వాత ఫ్రెండ్స్‌తో గొడవ కావడంతో విచారకరమైన రీల్ చిత్రీకరించే ప్రయత్నంలో అదుపుతప్పి ప్రమాదవశాత్తూ లిఫ్ట్ షాఫ్ట్ కోసం వదిలిన ఖాళీ ప్రదేశం నుంచి కిందపడిపోయిందని పోలీసులు భావిస్తున్నారు. 
 
తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై సౌత్ ఈస్ట్ డీసీపీ ఫాతిమా స్పందిస్తూ, ఈ ఘటనపై అన్నీ కోణాల్లో విచారణ జరుపుతున్నామన్నారు. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు దారితీసిందా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. యువతి స్నేహితుల వద్ద విచారణ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments