సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

ఠాగూర్
ఆదివారం, 23 నవంబరు 2025 (17:44 IST)
పైరసీకి పాల్పడినందుకు తన కుమారుడు, 'ఐబొమ్మ' నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలన్న ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్‌ వ్యాఖ్యలను 'ఐబొమ్మ' రవి తండ్రి అప్పారావు తీవ్రంగా స్పందించారు. సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుందని ఆయన ఘాటుగా బదులిచ్చారు. తన కుమారుడిని ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సబబు కాదన్నారు. 
 
ఐబొమ్మ రవి చేసిన పైరసీ వల్ల చిత్రపరిశ్రమకు భారీ నష్టం వాటిల్లిందని, అందువల్ల పైరసీకి పాల్పడిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలన్న నిర్మాత సి.కళ్యాణ్ వ్యాఖ్యలపై చిత్రపరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
వీటిపై రవి తండ్రి అప్పారావు స్పందిస్తూ, సినిమాలో సరైన విషయం ఉంటే ప్రేక్షకులు ఖచ్చితంగా థియేటర్లకు వచ్చి చూస్తారు. నేను ఒకపుడు 45 పైసలకే సినిమాలు చూశాను. కానీ ఇపుడు టికెట్ ధరలు దారుణంగా పెంచేశారు. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి  సినిమాలు ఎవరు తీయమన్నారు అని ప్రశ్నించారు. 
 
చిత్ర పరిశ్రమ తమ తప్పులను సరిదిద్దుకోవాలి తప్ప ఇతరులపై నిందులు వేయడం సరికాదన్నారు. అంతేకాకుండా తన కుమారుడు తరపున కేసు వాదిస్తున్న న్యాయవాదికి తాను ఆర్థికంగా కూడా అండగా ఉంటానని చెప్పారు. ఈ విషయంలో న్యాయపరంగానే ముందుకెళతానని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments