Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

Advertiesment
Bakasura Look poster

దేవీ

, శుక్రవారం, 2 మే 2025 (19:55 IST)
Bakasura Look poster
ప్రముఖ కమెడియన్‌, నటుడు ప్రవీణ్ త్వరలోనే భకాసుర అనే రెస్టారెంట్‌ను ప్రారంభించ బోతున్నారు. అనే న్యూస్‌  అందరిలోనూ కాస్త ఆసక్తి కలిగించి వైరల్‌గా మారింది. అయితే ప్రవీణ్‌ నటుడిగా బిజీగానే ఉన్నాడు కదా. మరీ వ్యాపారంలోకి ఎందుకు వెళ్లుతున్నాడు అనే సందేహం కూడా అందరిలో కలిగింది. అయితే ఎట్టకేలకు ఇప్పుడు ఈ న్యూస్‌పై ఓ క్లారిటీ వచ్చింది. ప్రవీణ్‌ ఎటువంటి రెస్టారెంట్‌ను పెట్టడం లేదు.
 
 ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం పేరు 'భకాసుర రెస్టారెంట్‌'. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. ఈ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో ప్రవీణ్‌ పెద్ద గరిటెతో వంట చేస్తుండటం.. ఆ పక్కనే ఇతర పాత్రలు ఆ పోస్టర్‌లో కనిపిస్తున్నాయి. ఆ పోస్టర్‌లోనే గమనిస్తే వైవా హర్ష, షైనింగ్‌ ఫణి మరో వైపు విచిత్రంగా సమ్‌థింగ్‌ స్పెషల్‌ పాత్రలుగా కనిపిస్తున్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలతో మంచి నటుడిగా, కమెడియన్‌గా అందరికి సుపరిచితుడైన ప్రవీణ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు.   కృష్ణభగవాన్‌ ,షైనింగ్‌ ఫణి, కేజీఎఫ్‌ గరుడరామ్‌,ఇతర ముఖ్య పాత్రలో యాక్ట్‌ చేస్తున్నారు. 
 
ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్‌ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమైంది.ప్రమోషనల్‌ భాగంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ '' హంగర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నేటి యువతరంతో పాటు అన్ని వర్గాలు అలరించే అంశాలున్నాయి. ప్రతి సన్నివేశం అందరికి ఎంతో థ్రిల్ల్‌ను పంచుతుంది. ప్రవీణ్‌ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాగా ఇది ఉండబోతుంది. నటుడిగా ఆయనలోని మరో కోణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నారు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మా చిత్రం తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది' అన్నారు. 
 
ప్రవీణ్‌, వైవా హర్ష, షైనింగ్‌ ఫణి (బమ్‌చిక్‌ బంటి), కేజీఎఫ్‌ గరుడ రామ్‌, కృష్ణభగవాన్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, ఉప్పెన జయకృష్న, వివేక్‌ దండు, అమర్‌, రామ్‌పటాస్‌, రమ్య, ప్రాచీ ఠాకూర్‌, జబర్థస్త్‌ అప్పారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డీఓపీ: బాల సరస్వతి, ఎడిటర్‌: మార్తండ్‌.కె.వెంకటేష్‌, సంగీతం: వికాస్‌ బడిస, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వినయ్‌ కొట్టి, ఆర్ట్‌ డైరెక్టర్: శ్రీ రాజా సీఆర్‌ తంగాల, పీఆర్‌ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు, నిర్మాతలు: లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి, దర్శకత్వం: ఎస్‌జే శివ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2025లో బెస్ట్ ఫిలింగా కిరణ్ అబ్బవరం క సినిమా