మెట్రో రైల్ రావడం ఆలస్యమైతే ప్రయాణికులపై అదనపు చార్జీలను బాదుతున్నారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది. ఓ ప్రయాణికుడు 12 నిమిషాలు ఆలస్యంగా స్టేషన్ దాటినందుకు రూ.15 అదనపు చార్జీని వసూలు చేశారు. మెట్రో రైల్ ఆలస్యంగా రావడంతో ఈ జాప్యం జరిగిందని, దీనికి బాధ్యులు ఎవరూ అంటూ ఆ ప్రయాణికుడు వాపోతున్నాడు.
ఇదే అంశంపై వరుణ్ అనే ప్రయాణికుడు స్పందిస్తూ, 'గత నెల 29న రాయదుర్గంలో సాయంత్రం మెట్రో రైలు ఎక్కా. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్ ఇంటర్చేంజ్ స్టేషనులో దిగా. అక్కడి నుంచి కాసేపు నడిచి జేబీఎస్ స్టేషన్‌కు చేరుకుని మెట్రో ఎక్కి ఆర్టీసీ క్రాస్ రోడ్డులో దిగాను. ప్రయాణం 1.30 గంటల సమయం దాటిందని అదనంగా రూ.15 ఛార్జీ చేశారు' అని ప్రయాణికుడు చేశారు. ఆ మార్గంలో ఆలస్యంగా 12 నిమిషాలకు ఒక మెట్రో ఉంటే.. దానికి ప్రయాణికులు బాధ్యులెలా అవుతారని ప్రశ్నిస్తున్నారు.
మెట్రో స్టేషనులోకి ప్రవేశించి రెండు గంటల తర్వాత బయటకు వస్తే అదనపు ఛార్జీ వడ్డిస్తున్నారని, అలాంటప్పుడు మెట్రో స్టేషనులో ఆహారశాలలు, ఇతర దుకాణాలు ఎందుకు ఏర్పాటు చేశారని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. టికెట్ తీసుకున్న తర్వాత అరగంట లోపే స్టేషనులోకి ప్రవేశించాలి. రెండు గంటల్లోపే బయటికి రావాలి. అవగాహన లేక అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది.