Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలెక్టరుపై దాడి కేసు.. 16 మంది అరెస్టు.. పోలీసుల అదుపులో 57 మంది...

ఠాగూర్
బుధవారం, 13 నవంబరు 2024 (13:06 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ మీద దాడి ఘటనలో కీలక వ్యక్తి సురేశ్ అని గుర్తించామని, అతని కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారని ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. అలాగే, ఈ కేసులో ఇప్పటివరకు 16 మందిని అరెస్టు చేయగా, మరో 53 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు జరిగిన విచారణ మేరకు మరికొంతమందిని అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు.
 
ఈ ఘటనపై మూడు కేసులు నమోదు చేశామన్నారు. దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణలో గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ జరగలేదన్నారు. కలెక్టర్ లగచర్లకు రాగానే ఒక్కసారిగా నినాదాలు చేస్తూ దాడికి ప్రయత్నించారని తెలిపారు. ఇలాంటి ఘటనలు జరుగుతాయని ముందుగానే గుర్తించిన కలెక్టర్ గ్రామ శివారులో సభను ఏర్పాటు చేశారన్నారు. ఈ ఘటనలో బయటి వ్యక్తుల ప్రమేయాన్ని గుర్తించామన్నారు. సురేశ్‌ను అరెస్ట్ చేశాక అతని వెనుక ఎవరున్నారో తేలుతుందన్నారు. అతని కాల్ డేటాను విశ్లేషిస్తున్నట్లు చెప్పారు. 
 
లగచర్ల దాడి కేసు : భారాస మాజీ ఎమ్మెల్యే పట్న నరేందర్ రెడ్డి అరెస్టు 
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం సోమవారం నిర్వహించిన భూ సేకరణ ప్రజాభిప్రాయ సమావేశం రణరంగంగా మారిన విషయం తెలిసిందే. 
 
భూములు ఇవ్వబోమంటూ లగచర్ల గ్రామస్థులు నిరసన తెలుపుతూ కలెక్టర్ సహా అధికారులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనపై నమోదైన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
 
భారత రాష్ట్ర సమితి నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో ఫిల్మ్ నగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. 
 
అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. లగచర్లలో అధికారులపై దాడికి పాల్పడిన 55 మందిని పోలీసులు మంగళవారం గుర్తించారు. అందరినీ అదుపులోకి తీసుకున్నారు. 
 
కాగా భూసేకరణ అభిప్రాయం కోసం కలెక్టరుతో పాటు వెళ్లిన ప్రత్యేకాధికారి వెంకట్ రెడ్డిని పట్టుకుని గ్రామస్థులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వారి నుంచి తప్పించుకున్న వెంకట్ రెడ్డి పొలాల వెంట పరుగులు పెట్టారు. 
 
ఆయనను కాపాడేందుకు ప్రయత్నించిన డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డిపై కూడా రైతులు దాడి చేశారు. ఈ దాడి ఘటనను రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మరోవైపు, పట్న నరేందర్ రెడ్డి అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. 
 
పట్నం అరెస్టు రేవంత్‌ చేతగాని పాలనకు నిదర్శనమన్నారు. తన సొంత నియోజకవర్గంలో ప్రజల తిరుగుబాటును బీఆర్‌ఎస్‌కు ఆపాదించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్తలతో మాట్లాడిన ప్రజాప్రతినిధులను..అరెస్టు చేస్తున్న దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇదన్నారు.
 
ప్రజలు తిరగబడుతుంటే వారిని అణిచివేసేందుకు, లగచర్లలో అప్రజాస్వామిక చర్యలకు దిగారని, ఇలాంటి నిర్బంధాలు, అక్రమ అరెస్టులు ఎన్నో చూశామన్నారు. నరేందర్‌రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments