Webdunia - Bharat's app for daily news and videos

Install App

7న తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం - జోరుగా ఏర్పాట్లు

Webdunia
బుధవారం, 6 డిశెంబరు 2023 (09:16 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. సమీక్షా సమావేసంలో డీజీపీ రవి గుప్తా, జీఏడీ ముఖ్య కార్యదర్శి శేషాద్రిలు పాల్గొన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మంగళవారం సాయంత్రం రేవంత్ రెడ్డి పేరును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
మరోవైపు, మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో కాబోయే ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. తనను సీఎల్పీ నేతగా ప్రకటించడానికి కొన్ని నిమిషాల ముందు ఆయన ట్విట్టర్ వేదికగా తుఫాను ప్రభావ అంశంపై ట్వీట్ చేశారు. తెలంగాణలో పలు జిల్లాలలో తుఫాను ప్రభావంపై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 
 
వరి ధాన్యం తడిసిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జన జీవనానికి ఇబ్బంది కలుగకుండా చూడాలని తెలిపారు. అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కాగా, రేవంత్ రెడ్డికి అత్యధిక ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున ఆయనను సీఎల్పీ నేతగా ఎంపిక చేసినట్లు కేసీ వేణుగోపాల్ తెలిపారు. మొత్తం 64 మంది ఎమ్మెల్యేల్లో రేవంత్ రెడ్డికి ఏకంగా 42 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. దీంతో ఆయన పేరును ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments