Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రయాన్-3లో మరో సక్సెస్: భూ కక్ష్యలోకి ప్రొపల్షన్ మాడ్యూల్

Webdunia
మంగళవారం, 5 డిశెంబరు 2023 (22:58 IST)
ఇస్రో చంద్రయాన్-3 విషయంలో మరో అడుగు ముందుకు వేసింది. చంద్రయాన్ 3 ప్రొపల్షన్ మాడ్యూల్ తన మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రకటించింది. అయితే, ప్రొపల్షన్ మాడ్యూల్‌ను చంద్ర కక్ష్య నుంచి తిరిగి భూ కక్ష్యలోకి విజయవంతంగా తరలించామని, తద్వారా భవిష్యత్తులో మరిన్ని సేవలు పొందవచ్చని ఇస్రో తెలిపింది. 
 
చంద్రునిపై ఇస్రో భవిష్యత్తు ప్రాజెక్టులకు అవసరమైన సమాచారాన్ని అందించడానికి చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్ భూమి కక్ష్యలోకి తిరిగి ప్రవేశించబడింది. చంద్రయాన్ 3 ప్రాజెక్టులో భాగంగా అప్పగించిన ప్రధాన పనులను ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ విజయవంతంగా పూర్తి చేసిందని ఇస్రో తెలిపింది. 
 
ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ ప్రధాన విధులు విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్‌ను భూస్థిర కక్ష్య నుండి చంద్రుని ఉపరితలానికి దగ్గరగా ఉన్న చంద్ర కక్ష్యలోకి తీసుకువెళ్లడం, ఆపై ల్యాండర్ మాడ్యూల్‌ను దాని నుండి వేరు చేసి చంద్రుని ఉపరితలంపైకి పంపడం.
 
దానిలో మిగిలి ఉన్న అదనపు ఇంధనాన్ని ఉపయోగించి, ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రునిపై ఇస్రో భవిష్యత్తు ప్రాజెక్టులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ భూమి చుట్టూ 1.54 లక్షల కి.మీ.ల దూరంలో పరిభ్రమిస్తోంది. అయితే దీని వల్ల ఆ కక్ష్యలోని ఇతర ఉపగ్రహాలకు ఎలాంటి ముప్పు ఉండదని ఇస్రో తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments