Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

#WhyAPNeedsJagan : సజ్జల, సీఎస్‌లకు ఏపీ హైకోర్టు నోటీసులు

sajjala
, బుధవారం, 29 నవంబరు 2023 (14:51 IST)
ఏపీ ప్రభుత్వం చేపట్టిన "వై ఏపీ నీడ్స్ జగన్" అనే కార్యక్రమాన్ని నిలిపి వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు స్వీకరించింది. రాజకీయపరమైన ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చారంటూ మంగళగిరికి చెందిన జర్నలిస్టు కట్టెపోగు వెంకయ్య అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపున న్యాయవాదులు నర్రా శ్రీనివాస్, ఉమేశ్ చంద్ర పిటిషన్ వేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాల్గొనకుండా నియంత్రించాలని పిటిషన్‌లో కోరారు.
 
ముఖ్యంగా, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచలన మేరకు ప్రభుత్వ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఆరోపించారు. సజ్జలతో పాటు చీఫ్ సెక్రటరీ, సాధారణ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్, పురపాలకశాఖ, గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీరు శాఖల ముఖ్య కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీతో కలిసి ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు పని చేయాలని మీడియా సమావేశంలో సజ్జల బహిరంగంగా చెప్పారని పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారని... అధికార పార్టీకి ఓటు వేసేలా ప్రజలను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినికీర్తించడానికి కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. ఈ పిటిషన్‌‍ను బుధవారం హైకోర్టు విచారించి.. సజ్జల, చీఫ్ సెక్రటరీ, సాధారణ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్, పురపాలకశాఖ, గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీరు శాఖల ముఖ్య కార్యదర్శులకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

‘కేసీఆర్ రైతు బంధు భరోసా బాండ్’ విడుదల.. రేవంత్ చిల్లర రాజకీయాలు