మంత్రి కేటీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. టీ-వర్క్స్‌లో నిరుద్యోగులతో కేటీఆర్ ముఖాముఖిపై ఫిర్యాదులు అందడంతో చర్యలు తీసుకున్నారు. దీనిపై ఈసీ కేటీఆర్‌ను వివరణ కోరింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంత్రి కేటీఆర్‌కు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది.
మంత్రి కేటీఆర్ ప్రభుత్వ కార్యాలయమైన టీ-వర్క్స్‌ను ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తున్నారని, ప్రభుత్వ కార్యాలయమైన టీ-వర్క్స్‌లో నిరుద్యోగులను కేటీఆర్ ఎలా ఇంటర్వ్యూ చేస్తున్నారని ఇటీవల కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సూర్జీవాలా ఈసీకి ఫిర్యాదు చేశారు. మంత్రి కేటీఆర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని రణదీప్ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదును స్వీకరించిన ఈసీ.. మంత్రి కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది.
టీ-వర్క్స్‌లో జరిగిన ఇంటర్వ్యూలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం కేటీఆర్‌ను కోరింది. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే అశోక్ నగర్ వెళ్లి యూనివర్సిటీ విద్యార్థులు, నిరుద్యోగులతో సమావేశమవుతానని మంత్రి కేటీఆర్ ఇటీవల యువతకు హామీ ఇచ్చారు.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమే. అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తానని కేటీఆర్ వెల్లడించారు. అనంతరం ఎన్నికలు, ఓట్లు, పార్టీల గురించి మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న తరుణంలో కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయమైన టీ-వర్క్స్ కేంద్రాన్ని రాజకీయ కార్యక్రమాలకు ఎలా ఉపయోగించుకుంటారని ప్రతిపక్షాలు సైతం కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అన్ని విషయాలను పరిశీలించిన ఈసీ మంత్రి కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది.