కేసీఆర్‌పై పోటీ.. లీడ్‌లో రేవంత్ రెడ్డి... భద్రత పెంపు

Webdunia
ఆదివారం, 3 డిశెంబరు 2023 (11:18 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో వుంది. 119 అసెంబ్లీ స్థానాలున్న తెలంగాణలో మ్యాజిక్ మార్క్ 60 సీట్లు కాగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 61 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఫలితాల ట్రెండ్‌తో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పోలీసులు భద్రత పెంచారు. రేవంత్ రెడ్డి నివాసానికి ట్రాఫిక్ పోలీసులు భద్రతను పెంచారు. 
 
తన సొంత నియోజకవర్గం కొడంగల్ తో పాటు కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పైనా రేవంత్ రెడ్డి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు చోట్లా రేవంత్ రెడ్డి ముందంజలో వున్నారు. ఎగ్జిట్ పోల్స్‌ అన్నీ కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపడంతో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద శనివారం నుంచే భారీ భద్రత ఏర్పాటు చేశారు. 
 
ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ అభ్యర్థుల హవా కొనసాగడంతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకుంటున్నారు. దీంతో రేవంత్ రెడ్డి ఇంట, కాంగ్రెస్ కార్యాలయాల వద్ద కార్యకర్తలు బాణసంచా కాలుస్తూ సందడి చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dr. Kamakshi: ఆ దర్శకుడి కంఫర్ట్ తోనే వరుస సినిమాలు : డాక్టర్ కామాక్షి భాస్కర్ల

ఐటెమ్ సాంగ్ చేయమని ఎవరూ అడగలేదు... మీ ఫ్యామిలీలో ఎవరినైనా చేయమన్నారేమో.... ఖుష్బూ

2 నెలలుగా చదువుకు ఫీజులు చెల్లించడం లేదు : కరిష్మా కపూర్ పిల్లలు

రాజమౌళి ప్రశంసలు తనకు దక్కిన గౌరవం : పృథ్విరాజ్ సుకుమారన్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments