Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణా రాష్ట్రంలో ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్ - కవితపై ఫిర్యాదు వచ్చింది..

vikasraj
, గురువారం, 30 నవంబరు 2023 (14:55 IST)
తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతుందని ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఆయన తన సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఆయన మాట్లాడుతూ... సమస్య రావడంతో ఒకటి రెండు చోట్ల ఈవీఎంలు మార్చడం జరిగిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. కానీ పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం మరింతగా పెరగవలసి ఉందన్నారు. ఎపిక్ కార్డు లేకపోతే 12 ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులు ఉన్నాయని, వాటిని గుర్తింపు కార్డులుగా చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు. 
 
అదేసమయంలో భారాస ఎమ్మెల్సీ కవితపై ఫిర్యాదు వచ్చినట్లు తెలిపారు. డీఈవోకు నివేదించామని, ఎఫ్ఎస్ఐఆర్ కూడా నమోదయినట్లు చెప్పారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా ఫిర్యాదు వస్తే ఎఫ్ఎఆర్ నమోదయిందన్నారు. మరికొన్ని ఫిర్యాదులు కూడా వచ్చాయని, ఆయా డీఈవోలకు పంపించామని, చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
 
నాగార్జునసాగర్ అంశంపై కూడా సీఈవో స్పందించారు. ఆ విషయాన్ని పోలీసులు చూసుకుంటారని, ఆ అంశంపై రాజకీయ నేతలు తొందరపడవద్దని, తప్పుడు వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. ఎన్నికల నిబంధనలను ఎవరూ అతిక్రమించకూడదన్నారు. కాగా, తెలంగాణలో ఎన్నికల పోలింగ్ వేళ నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద అర్థరాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. నీటి కోసం అర్థరాత్రి దాటిన తర్వాత ఏపీ పోలీసులు చొరబడి నాగార్జున సాగర్ డ్యాంకు ముళ్లకంచె ఏర్పాటుచేశారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో మాటా మాటా పెరిగి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాదీలు.. ప్లీజ్ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయండి...