Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్నికల గుర్తు కంటే మీరే అందంగా ఉన్నారు....

Advertiesment
mangilipalli bhargavi
, శనివారం, 25 నవంబరు 2023 (14:58 IST)
ఎన్నికల గుర్తు కంటే మీరే అందంగా ఉన్నారు అంటూ ఓ స్వతంత్ర మహిళా అభ్యర్థిని ఉద్దేశించి రిటర్నింగ్ అధికారి చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ అయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలో మంగిలిపల్లి భార్గవి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే, శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వం జూనియర్ కాలేజీలో మాక్ పోలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా తనకు కేటాయించిన బేబీ వాకర్ గుర్తు ఈవీఎంలో సరిగా కనిపించడం లేదంటూ రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డికి చెప్పారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఎన్నికల గుర్తు కంటే మీరే చాలా బాగున్నారు అన శ్రీనివాస్ రెడ్డి కామెంట్స్ చేశారు. దీంతో ఆమె నొచ్చుకున్నారు. 
 
రిటర్నింగ్ అధికారి తన పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ ఆమె ఇతర స్వతంత్ర అభ్యర్థులతో కలిసి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. నిరుద్యోగంతో బాధపడుతున్న తాను సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తున్నానని, తన పట్ల అవమానకరంగా వ్యవహరించిన ఆర్డీవోపై చర్య తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రధాన పార్టీల మహిళా అభ్యర్థుల విషయంలో ఇలానే వ్యవహరిస్తారా? అని ఆమె ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. మరోవైపు, ఈ అంశంపై శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ తాను ఒక్క మాట కూడా అసభ్య పదజాలాన్ని ఉపయోగించలేదని వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్యలు, వలసలు.. కేసీఆర్