Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ బ్లేడును అలాగే వదిలేయ్... ఆయన గెడ్డం ఇంకా పెంచుకోవచ్చు... ఎవరు?

Webdunia
మంగళవారం, 11 డిశెంబరు 2018 (13:36 IST)
''బ్లేడుతో గొంతు కోసుకుంటామని చెప్పిన వారిని, గెలిస్తేనే గడ్డం తీస్తానని చెప్పిన వారిని క్షమించి వదిలివేస్తున్నామని '' నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఎంపి కవిత మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో ప్రజా కూటమి ఓడిపోతే బ్లేడుతో గొంతు కోసుకుంటామని చెప్పిన వారిని, గెలిస్తేనే గడ్డం తీస్తానని చెప్పిన వారిని క్షమించి వదిలివేస్తున్నామని వ్యాఖ్యానించారు. 
 
వారికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని, ఇక వారి ప్రగల్భాలపై విజ్ఞతను వారికే వదిలివేస్తున్నామని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇంత భయంకరమైన శిక్షే చాలా పెద్దదని, ప్రజలు విధించిన ఈ శిక్ష కన్నా మరో పెద్ద శిక్ష ఉండబోదని ఎద్దేవా చేశారు. 
 
ఇక గడ్డాలు పెంచుకోవడం, సన్యాసం తీసుకోవడం వారిష్టమేనని, ఇకనైనా వారి మనసు మార్చుకుని రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తే, తదుపరి ఎన్నికల్లోనైనా మెరుగైన ఫలితాలను సాధించుకోవచ్చని కవిత సలహా ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Tej: పేరెంట్స్‌తో విషయాలు పంచుకునేలా పిల్లలుండాలి - సాయి దుర్గ తేజ్

విశ్వప్రసాద్, డైరెక్టర్ కార్తీక్ రెండు పిల్లర్ లా మిరాయ్ రూపొందించారు : తేజ సజ్జా

Kantara 1: రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 కోసం సాంగ్ రికార్డ్ చేసిన దిల్‌జిత్

Komati reddy: సినెటేరియా ఫిలిం ఫెస్టివల్ వెబ్ సైట్ ప్రారంభించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Manoj: నన్నే కాదు నా కుటుంబాన్ని నిలబెట్టి ఆయనే : మంచు మనోజ్

తర్వాతి కథనం
Show comments