Publish Date: Tue, 11 Dec 2018 (09:59 IST)
Updated Date: Tue, 11 Dec 2018 (10:04 IST)
సహజంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లిన చాలా పార్టీలు ఎన్నికల్లో బోల్తా కొట్టాయి. ఆఖరికి చంద్రబాబు నాయుడు హయాంలోని తెదేపా కూడా అలాంటి పరిస్థితి ఎదుర్కొంది. ఇకపోతే తాజా తెలంగాణ ఎన్నికల్లో తెరాస కారు జోరు చాలా స్పీడుగా వుంది. మొత్తం 119 స్థానాల్లో 70 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తోంది.
గతంలో 2014లో కేవలం 64 సీట్లు గెలుచుకున్న తెరాస ఇప్పుడు ఏకంగా 70 స్థానాలకు పైగా చేజిక్కించుకునే దిశగా పరుగులు పెడుతోంది. ఈ నేపధ్యంలో ప్రజా కూటమికి చావుదెబ్బ తగిలింది. ఇదంతా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు జత కట్టడంతోనే మారిందా అనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి. చూడాలి ఫైనల్ ఫలితాలు ఎలా వుంటాయో?