Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్ర కొత్త మంత్రులు వీరేనా?

Webdunia
బుధవారం, 12 డిశెంబరు 2018 (16:27 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తెరాస విజయభేరీ మోగించింది. మొత్తం 119 అసెంబ్లీ సీట్లకుగాను ఏకంగా 88 సీట్లలో విజయభేరీ మోగించింది. దీంతో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గురువారం మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 
 
అయితే, ఈ ఎన్నికల్లో గత ప్రభుత్వంలో పని చేసిన నలుగురు మంత్రులతో పాటు స్పీకర్ ఓడిపోయారు. వీరిలో జూపల్లి కృష్ణారావు, చందూలాల్, తుమ్మల నాగేశ్వర రావు, మహేందర్ రెడ్డిలు మంత్రులుగా పనిచేసి ఓడిపోయారు. మధుసూదనా చారి మాత్రం స్పీకర్‌గా పని చేసి పరాజితులయ్యారు. 
 
దీంతో కొత్తవారికి చోటుదక్కుతుందనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఉన్నవారిలోనూ కొందర్ని మారుస్తారంటూ వార్తలు వస్తున్నారు. కొత్త మంత్రివర్గంలో చేరేవారు వీరేనంటూ ముమ్మరంగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే మంత్రివర్గ కూర్పుపై కేసీఆర్ కసరత్తు మొదలుపెట్టినట్టు సమాచారం. 
 
కొత్తగా మంత్రులుగా అవకాశం దక్కించుకునేవారిలో కొప్పుల ఈశ్వర్‌ (ధర్మపురి), బాల్క సుమన్‌ (చెన్నూరు), నోముల నర్సింహయ్య (నాగార్జునసాగర్‌), సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి (వనపర్తి), దాస్యం వినయ్‌భాస్కర్‌ (వరంగల్‌ తూర్పు), శ్రీనివాస్‌గౌడ్‌ (మహబూబ్‌నగర్‌), రేఖానాయక్‌ (ఖానాపూర్‌), పద్మాదేవేందర్‌ రెడ్డి (మెదక్‌), ఎర్రబెల్లి దయాకర్‌రావు (పాలకుర్తి), వేముల ప్రశాంత్‌రెడ్డి (బాల్కొండ), మాధవరం కృష్ణారావు (కూకట్‌పల్లి) పేర్లు బలంగా వినిపిస్తున్నారు. పాతమంత్రుల్లో కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్‌, నాయిని నర్సింహా రెడ్డిలు కొనసాగనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: పుష్ప -2 ‌పై పూనమ్ కౌర్ ప్రశంసలు.. జాతర సీన్ అదిరింది.. స్పందించేదేలే!

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

పుష్ప-2: స్మగ్లింగ్‌ను కీర్తిస్తున్న సినిమాకు సబ్సిడీలా.. సీపీఐ నారాయణ

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

తర్వాతి కథనం
Show comments