తెలంగాణ రాష్ట్ర సమితి అసెంబ్లీ ఎన్నికల్లో కారు స్పీడుకు అడ్డులేకుండా పోయింది. ఫలితంగా గులాబీ గుభాళించింది. మొత్తం 119 సీట్లకుగాను తెరాస ఏకంగా 88 సీట్లలో విజయభేరీ మోగించింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అయితే, తెలంగాణ రాష్ట్రంలో తెరాస విజయం సాధిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంబరాలు మిన్నంటాయి. కేసీఆర్, కేటీఆర్ యువసేనల ఆధ్వర్యంలో గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఈ సంబరాలు జరిగాయి.
ముఖ్యంగా, తెరాస గెలుపుకంటే... కాంగ్రెస్ - టీడీపీ సారథ్యంలోని ప్రజాకూటమి ఓడిపోవడాన్ని చాలా మంది సంబరాలు చేసుకుంటున్నారు. అంతేకాకుండా తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి విజయాన్ని కాంక్షిస్తూ.. ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారం నిర్వహించడం కలిసిరాలేందంటున్నారు.
తెరాస గెలుపును తమ గెలుపుగా భావించుకుంటూ ఏపీ అభిమానులు పలుచోట్ల సంబరాలు చేసుకోవడం విశేషం. విజయవాడ, మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకుని సందడి చేశారు. మొత్తానికి తెలంగాణలో ఒకే ఒక్కడు పోటీలోకి దిగి, భారీ మెజారిటీతో గెలిచిన కేసీఆర్ నిజంగా మగాడ్రా బుజ్జీ అని మాట్లాడుకుంటున్నారు.