Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను తలుచుకుంటే ఎవరినైనా సీఎం పదవిపై కూర్చోపెడతాను లేదంటే వంగోపెడతా...

Webdunia
శనివారం, 24 నవంబరు 2018 (21:13 IST)
అక్బ‌రుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. మజ్లిస్ తలుచుకుంటేనే ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యేది అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హ‌వా ఉంద‌ని అంటున్నారు. నేను కానీ.. 4 రోజులు ప‌ర్య‌ట‌న చేస్తే తెలంగాణలో భూకంపం వ‌స్తుంది అని అన్నారు. అంతేకాకుండా.. ఏ ముఖ్యమంత్రి అయినా త‌న‌ ముందు తలవంచాల్సిందే అని చెప్పారు. 
 
గ‌తంలో చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి త‌న ముందు త‌ల‌వంచార‌ని.. ఇప్పుడు కేసీఆర్ అయినా త‌న‌ ముందు తల వంచాల్సిందే. మా మాట వినాల్సిందే అన్నారు. ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయ‌ వ‌ర్గాల్లో పెద్ద దుమారం రేపాయి. 
 
11వ తేదీ తర్వాత మజ్లిస్ పార్టీ పవర్ ఏంటో ప్రపంచానికి చూపిస్తాం. నేను నాయకుడిని కాదు.. రాజకీయ రాజుని... నేను తలుచుకుంటే ఎవరినైనా ముఖ్యమంత్రి పదవిపైన కూర్చో పెడతాను లేదంటే వంగో పెడతాను అన్నారు. 
 
గతంలో నిజామాబాద్ సమావేశంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఎవ‌రూ మర్చిపోలేదు. ఇప్పుడు ఈవిధంగా ఓవైసీ వ్యాఖ్య‌లు చేయ‌డంతో వివాద‌స్ప‌దం అయ్యింది. మ‌రి... ఈ వివాదం ఎంతవ‌ర‌కు వెళుతుందో..? మిగిలిన రాజ‌కీయ పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

తర్వాతి కథనం
Show comments