Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ రెడ్డి చెప్పిన సెంటిమెంట్ ప్ర‌కారం కేటీఆర్ సీఎం కాలేడా..?

Webdunia
శనివారం, 24 నవంబరు 2018 (21:06 IST)
యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీపై టీఆర్ఎస్ నేతలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. పార్టీలో త‌ను రెండో స్ధానంలో ఉన్నాన‌ని చెప్పారు. ఎవరు ముఖ్యమంత్రి అయినా.. ఒప్పించి చేయిస్తాం. బాల్ థాక్రే ఎప్పుడైనా ముఖ్యమంత్రి అయ్యాడా..? ప్ర‌శ్నించారు. త‌నకు విజ‌న్ ఉంది అని... అందుకే ఆలోచనను పంచుకుంటున్నాను అని చెప్పారు.
 
జోనల్ వ్యవస్థ విషయంలో మోడీ కాలర్ పట్టుకుని తెచ్చినా అంటున్న కేసీఆర్.. మైనార్టీ రేజర్వేషన్ పైన మోడీ కాలర్ ఎందుకు పట్టుకోవటం లేదు అని ప్ర‌శ్నించారు. సచివాలయం బందులదొడ్డి లెక్క మారిపోయింది. ఇప్పటి సచివాలయంలో ముఖ్యమంత్రిగా చేసిన 16 మంది సీఎంల పిల్లలు ఎవరు ముఖ్యమంత్రి కాలేదు. అల్లుడు మాత్రమే సీఎం అయ్యాడు. 
 
అందుచేత కొడుకు కేటీఆర్ కాకుండా అల్లుడు హ‌రీష్ రావు సీఎం అవుతాడేమో అనే భయం కేసీఆర్‌కి పట్టుకుంది అంటూ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు రేవంత్ రెడ్డి.
 
ఇదే క‌నుక నిజ‌మైతే... చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్‌కి కూడా సీఎం యోగం లేన‌ట్టే. చంద్ర‌బాబు త‌ల‌చుకుంటే ఏదైనా చేయ‌గ‌ల‌డు. మ‌రి.. ఈ విష‌యం తెలిస్తే... సెంటిమెంట్‌ని బ్రేక్ చేయ‌డం కోసం ఏం చేస్తారో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

రతన్ టాటా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం : నిత్యా మీనన్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments