Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్ పైన శ్రీరెడ్డి పీకుడు మామూలుగా లేదు... జనసేన టార్గెట్‌గా... బ్యాక్‌గ్రౌండ్ ఖాయమేనా?

మెగా ఫ్యామిలీ పైన గతంలో చాలామంది టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా శ్రీరెడ్డి కూడా ఇందులో చేరిపోయినట్లు కనబడుతోంది. తొలుత పవన్ కళ్యాణ్‌తో మొదలై ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిపైన విమర్శనాస్త్రాలు సంధిస్తూ పెద్ద వ్యాసమే రాసేసింది. ఇప్పుడు మళ

Advertiesment
పవన్ పైన శ్రీరెడ్డి పీకుడు మామూలుగా లేదు... జనసేన టార్గెట్‌గా... బ్యాక్‌గ్రౌండ్ ఖాయమేనా?
, మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (16:11 IST)
మెగా ఫ్యామిలీ పైన గతంలో చాలామంది టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా శ్రీరెడ్డి కూడా ఇందులో చేరిపోయినట్లు కనబడుతోంది. తొలుత పవన్ కళ్యాణ్‌తో మొదలై ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిపైన విమర్శనాస్త్రాలు సంధిస్తూ పెద్ద వ్యాసమే రాసేసింది. ఇప్పుడు మళ్లీ పవర్ స్టార్ పవన్ టార్గెట్‌గా మరికొన్ని చేసింది. చూడండి... ఆమె రాతల్లో... యధాతథంగా....
 
"మిస్టర్ ..... ఏమిటి ఈ మాయ...
పాచి పోయిన లడ్డులు అన్నావు..
ఉత్తరం దక్షిణం అన్నావు..
అవినీతి జరుగుతుందన్నావు..
నిరూపించమంటే నాకు తెలవదు బయట అనుకుంటున్నారు...చూసుకోండి అన్నావు...
నాకు కులం లేదూ అన్నావు..మా రంగాను అన్యాయంగా చంపేశారు అని అన్నావు...
కామన్ మాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అన్నావు..పెద్ద ఫార్సు చేశావు...
లెక్కలు నేను తేలుస్తాను అన్నావు...కమిటీలో దొంగల్ని పెట్టావు..
మా అన్న చేసింది తప్పు అన్నావు..మా అన్న ను మోసం చేసిన వాళ్ల మీద పగ తీర్చుకుంటాను అన్నావు..
నీకు గెలిచే సత్తా లేక పోయినా పేద్ద ఫోజు కొడుతూ మిమ్మల్ని నేనే గెలిపించాను అన్నావు...
పవర్ ను అనుకున్నావు..ఎన్ని చెత్త ప్లాప్ సినిమాలో లెక్కేసుకో...
ఆడోళ్లంటే ఆటబొమ్మలనకున్నావు.... ఒకటికి మూడు చేసుకున్నావు.....
నీ అవసరాలకోసం అందర్నీ దగా చేశావు..చివరకు అమ్మకు కూడా బురద పూశావు...
చివరకు చేత కాక నీ నిజ రూపం బయటపెట్టుకున్నావు..
నీకు నటన రాదనుకున్నాము కాని సినిమాల్లో రాకపోయినా బయట బాగానే నటించావు...
నిన్నేమనాలి....నువ్వు ఆంధ్రద్రోహివి...ప్రజా ద్రోహివి..జనద్రోహివి.
తెలుగుప్రజలు నిన్ను క్షమించరు......
ప్రత్యేక హోదా ఇవ్వని మోడీకి కాపలాగా ఉన్నావు.... ఎవరూ ఏమాట మోడీని అన్నా... మోడీని తిడతారా అని ట్విట్టర్ వేదికగా సపోర్ట్ చేస్తున్నావు.....
 
ఇదేనా నీవు చేగువేరా నుండి తీసుకున్న ఆదర్శం...." అంటూ మెగా ఫ్యామిలీపై కారాలు కొట్టేసింది శ్రీరెడ్డి ఉరఫ్ శ్రీశక్తి. మరి ఇది ఎంతవరకు వెళుతుందో చూడాలి. ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసేందుకు రెడీ అయిపోయినట్లు తెలుస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్యాస్టింగ్ కౌచ్‌కు పార్లమెంట్ అతీతమని భావించకండి: రేణుకా చౌదరి