Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాస్టింగ్ కౌచ్ పైన మంచు మ‌నోజ్ ఏమ‌న్నాడో తెలుసా..?

టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ పైన ఎలాంటి చ‌ర్చ జ‌రుగుతోందో.. ఈ వివాదం ఏ స్థాయికి వెళ్లిందో తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పుడిప్పుడే సినీ తార‌లు మాట్లాడుతున్నారు. కొంతమంది కాస్టింగ్ కౌచ్ ఉంద‌ని చెబుతుంటే.. మ‌రికొంతమంది అయితే... అలాంటిది ఏమీ లేదంటు

Advertiesment
Manchu Manoj
, మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (12:38 IST)
టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ పైన ఎలాంటి చ‌ర్చ జ‌రుగుతోందో.. ఈ వివాదం ఏ స్థాయికి వెళ్లిందో తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పుడిప్పుడే సినీ తార‌లు మాట్లాడుతున్నారు. కొంతమంది కాస్టింగ్ కౌచ్ ఉంద‌ని చెబుతుంటే.. మ‌రికొంతమంది అయితే... అలాంటిది ఏమీ లేదంటున్నారు. తాజాగా మంచు వార‌బ్బాయి మ‌నోజ్ కూడా ఈ వివాదం గురించి స్పందించాడు. ఇంత‌కీ మ‌నోజ్ స్పంద‌న ఏమిటంటే... టాలీవుడ్‌లో వివాదాలకు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు దూరంగా ఉంటున్నానని కూడా కొంతమంది అంటున్నారని చెప్పారు. కానీ తను అలాంటి వాడిని కానని చెప్పారు. 
 
ప్రతి పరిశ్రమలోనూ మహిళలు లైంగిక వేధింపులకు గురువుతున్నారని, ఏడు భయంకరమైన పాపాల్లో కామము ఒకటని, అది ప్రతి పరిశ్రమలోనూ  ఉందన్నారు. ఈ సమస్యను పారద్రోలాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు.
 
సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుదామని పవన్ కళ్యాణ్ అన్న ట్వీట్‌ చేసిన సంగతి గుర్తు చేస్తూ.. తను కూడా పవన్‌కు మద్ధతు తెలుపుతున్నట్లు తెలిపారు. మనమంతా కళామతల్లి ముద్దు బిడ్డలమన్నారు. అనవసరమైన వివాదాలకు తెరలేపకుండా అందరూ సైలెంట్‌గా ఉండాలని కోరారు. త్వరలోనే ప్రతి విషయం సర్దుకుంటుందన్నారు. అలాగే ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్ధతు తెలుపుతున్నట్లు లేఖ ద్వారా వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మల్టీస్టారర్ ''ఎఫ్-2''లో అనసూయ.. అందుకే వాటి జోలికెళ్లను..