Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మల్టీస్టారర్ ''ఎఫ్-2''లో అనసూయ.. అందుకే వాటి జోలికెళ్లను..

బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన యాంకర్ అనసూయకు ప్రస్తుతం రంగస్థలం రంగమ్మత్త రోల్ మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. రంగస్థలంలో అనసూయ పోషించిన 'రంగమ్మత్త' పాత్రకు సూపర్ క్రేజ్ లభించింది. దీంతో అనసూయ

Advertiesment
మల్టీస్టారర్ ''ఎఫ్-2''లో అనసూయ.. అందుకే వాటి జోలికెళ్లను..
, మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (12:28 IST)
బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన యాంకర్ అనసూయకు ప్రస్తుతం రంగస్థలం రంగమ్మత్త రోల్ మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. రంగస్థలంలో అనసూయ పోషించిన 'రంగమ్మత్త' పాత్రకు సూపర్ క్రేజ్ లభించింది. దీంతో అనసూయకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. రానున్న సినిమాల్లో అనసూయ కోసం స్పెషల్ సాంగ్స్ క్రియేట్ చేయడం మొదలెట్టేశారు. 
 
తాజాగా అనిల్ రావిపూడి సినిమాలో అనసూయకు కీలక పాత్ర దక్కిందని సమాచారం. ఈ పాత్ర ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇది మల్టీ స్టారర్ సినిమా అని.. ఇందులో వెంకటేష్-వరుణ్ తేజ్ కథానాయకులుగా నటిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా మెహ్రీన్‌ను తీసుకున్నారు. మరో కథానాయిక కోసం అన్వేషణ కొనసాగుతోందని.. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకి ''ఎఫ్ 2'' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మే నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.  
 
ఇదిలా ఉంటే, సినీనటుడు పోసాని కృష్ణమురళితో డిబేట్‌ నిర్వహిస్తూ ఓ న్యూస్‌ ఛానెల్‌ ఎడిటర్‌ ఇటీవల సినీ పరిశ్రమలోని మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి, యాంకర్ అనసూయ స్పందించింది. జర్నలిస్టుగా ఉన్నప్పుడు చాలా బాధ్యతతో వ్యవహరించాలని, బాధ్యతారహితంగా మాట్లాడకూడదని హితవు పలికింది. టీవీల్లో లేనిది వున్నట్టుగా చెప్పకూడదని.. ఇలాంటి సంఘటనల తర్వాత తాను న్యూస్‌ ఛానెళ్లలో ఇంటర్వ్యూకి వెళ్లడం ఆపేశానని, మనల్ని గౌరవించని చోటుకి మనం ఎందుకు వెళ్లాలని ప్రశ్నించింది. తాను యాంకర్‌గా ఉన్న జబర్దస్త్‌లో మాత్రం డబుల్‌ మీనింగ్‌ డైలాగులు ఉంటాయని, కానీ అందరినీ నవ్వించడమే తమ ప్రయత్నమని చెప్పుకొచ్చింది.
 
పాత సినిమాల్లో కూడా డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నాయని, రాజనాల, రేలంగిలాంటి వారు కూడా వాటిని ఉపయోగించేవారని గుర్తు చేసింది.  ఇప్పటికే జబర్దస్త్‌లో చాలా మార్పులు చేశామని, ఇప్పుడు చాలా మందికి నచ్చుతోందని, ఎంజాయ్‌ చేసేవారు చేస్తారని, ఏదైనా చెడ్డగా అనిపిస్తే దూరంగా ఉండండని జబర్దస్త్ భామ సలహా ఇచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్టీఆర్ బయోపిక్‌లో దేవాన్ష్, శౌర్యరామ్.. మోక్షజ్ఞను వద్దన్నారు..