ఆ ముదురు హీరోకు బ్యాడ్‌టైమ్... మూవీలన్నీ ఆగిపోతున్నాయ్..
విక్టరీ వెంకటేష్ "గురు" సినిమా రిలీజ్ అవ్వడం..విజయం సాధించడం జరిగి చాలా రోజులైంది. ఆతర్వాత 'రాజు గారి గది 2'లో నటించాలి అనుకున్నాడు. ఓంకార్‌తో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు.
విక్టరీ వెంకటేష్ "గురు" సినిమా రిలీజ్ అవ్వడం..విజయం సాధించడం జరిగి చాలా రోజులైంది. ఆతర్వాత 'రాజు గారి గది 2'లో నటించాలి అనుకున్నాడు. ఓంకార్‌తో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. ఏమైందో ఏమో ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత క్రిష్‌తో వెంకీ ఓ సినిమా చేయాలనుకున్నాడు. కథాచర్చలు జరగడం... బడ్జెట్ ప్లాన్ అంతా బాగానే జరిగింది. కథపై హక్కులు వేరే వాళ్ల దగ్గర ఉండడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది.
ఆ తర్వాత పూరితో "జనగనమణ" సినిమా చేయాలనుకున్నాడు. కాకపోతే ఈ ప్రాజెక్టుకి భారీ బడ్జెట్ అవసరం. వెంకీతో అంత బడ్జెట్ వర్కవుట్ కాదనే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్ట్ కూడా సెట్స్‌పైకి వెళ్లకుండానే రద్దు చేశాడు. ఇటీవల తేజతో వెంకీ ఓ సినిమా చేయాలనుకున్నాడు. ఈ సినిమా కోసం కొత్తవాళ్లను కొంతమందిని ఎంపిక చేశారు కూడా. రామానాయుడు స్టూడియోలో ప్రారంభోత్సవం జరిగింది.
ఆ తర్వాత ఏమైందో ఏమో ఈ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. ఇలా.. వెంకీ ఏ సినిమా చేద్దామన్నా... ఏదో కారణంతో ఆగిపోతుంది. ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి ఓ సినిమా, వరుణ్ తేజ్ కలిసి ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు వెంకీ. మరి.. ఈ సినిమాలైనా సెట్స్‌పైకి వెళతాయో లేదో చూడాలి.