Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వీట్ రవ్వ కేక్... ఎలా చేయాలో తెలుసా?

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (20:37 IST)
సాధారణంగా కేక్స్ అంటే పిల్లలకు ఎంతో ఇష్టం. వీటికోసం బేకరీల చుట్టూ తిరిగి పిల్లలు డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. కనుక మనం మన ఇంట్లోనే పిల్లలకు ఇష్టమైన కేకులను తక్కువ ఖర్చుతో ఎంతో రుచిగా తయారుచేసి పెట్టవచ్చు. ముఖ్యంగా రవ్వతో చేసిన కేక్స్ ఎంతో రుచిని కలిగి ఉండి మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. ఇప్పుడు రవ్వను ఉపయోగించి కేక్స్ ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.
 
కావలసిన పదార్ధాలు...
బొంబాయి రవ్వ- 2 కప్పులు
తినే సోడా-అర టీ స్పూన్
పచ్చికొబ్బరి తురుము-ఒక కప్పు
నెయ్యి-పావుకప్పు
పెరుగు- ఒక కప్పు
బాదం- పావు కప్పు
చక్కెర- 2 కప్పులు
పాలు- పావు కప్పు
నిమ్మరసం- ఒక టేబుల్ స్పూన్
 
తయారీ విధానం..
ఒక బాణలిలో బొంబాయి రవ్వ, తినే సోడా, కొబ్బరితురుము, పాలు, పెరుగు, నెయ్యి, ఒక కప్పు చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక వెడల్పాటి పాత్రలో సమానంగా పోసి కుక్కర్లో అరగంటపాటు ఉడికించాలి. ఒక గ్లాసు నీళ్లు, నిమ్మరసం వేసి మిగిలిన చక్కెరను పాకం పెట్టాలి. రవ్వకేక్ వేడిగా ఉండగానే పైన చక్కెర పాకం పోసి రెండు నిమిషాలు నాననివ్వాలి. తర్వాత నచ్చిన ఆకారంలో కట్ చేసుకొని పైన బాదంతో అలంకరించుకోవాలి. అంతే.. స్వీట్ కేక్ రెడీ.       

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments