ఖర్జూరాలను పాలలో కలుపుకుని తీసుకుంటే...

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (20:19 IST)
ఖర్జూరాలు మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఇవి ఆరోగ్యానికి పలు రకాలుగా మేలు చేస్తాయి. ఖర్జూరాలలో కొలస్ట్రాల్ ఉండదు. ఖర్జూరాలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. ఇందులో అనేక రకములైన పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్-ఎ, బిలతో పాటు ఐరన్, పాస్పరస్, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. వీటిని పాలతో కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
 
1. అత్యంత తియ్యగా ఉండే ఈ ఖర్జూరంలో గ్లూకోజ్, ప్రక్టోజ్‌లు అధికంగా ఉంటాయి. ఖర్జూరం రోజూ తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉండి, గుండెకు సంబందించిన వ్యాదులను దూరంగా ఉంచుతుంది. గుండెకు బలాన్ని చేకూరుస్తుంది.
 
2. ఇందులో యాంటీఆక్సీడెంట్ల రూపంలో ఉండే విటమిన్-సి కంటికి చాలా మంచిది. దీనిని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా కంటికి సంబంధించిన సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.
 
3. ఖర్జూరాలు ఆరోగ్యకరమైన బరువు పెంచడానికి సహాయపడుతుంది. బాగా సన్నగా ఉన్నవారు రోజూ ఖర్జూరాన్ని తినడం వల్ల సహజంగా బరువు పెరుగుతారు. కాబట్టి బరువు తగ్గాలని అనుకునేవారు రోజువారి ఆహారంలో ఖర్జూరాన్ని చేర్చుకోవడం మంచిది.
 
4. కిడ్నీల్లో ఏర్పడే రాళ్లను కరిగించే శక్తి ఖర్జూరాలకు ఉంది. అంతేకాకుండా మూత్ర సంబంధిత సమస్యలను, ఇన్పెక్షన్లని దూరం చేస్తుంది. రాత్రిపూట నీటిలో నాలుగు ఖర్జూరాలను నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల మలబద్దకాన్ని తగ్గించుకోవచ్చు. ఖర్జూరంలో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
 
5. ఎముకల దృఢత్వానికి బాగా ఉపకరిస్తాయి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, కాపర్ సమృద్దిగా ఉన్నాయి. దంతాలను దృఢపరచడంలో ఇవి కీలకపాత్ర వహిస్తాయి. అంతేకాకుండా జలుబు, గొంతులో శ్లేష్మాన్ని తగ్గిస్తుంది. రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. ఇందులో ఉండే ఔషద గుణాలు పెద్ద ప్రేగులోని సమస్యలను నివారిస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి విరాళిస్తున్న త్యాగధనులు, ఎవరెవరు ఎంతెంత ఇచ్చారు?

కర్నాటక సీఎం సిద్ధు రాజీనామాకు గవర్నర్ ఆమోదం

ఒంటరి మహిళపై అత్యాచారం - సీఐ పరారీ... ఆచూకీ కనిపెట్టని పోలీసులు

ఒకవైపు శాంతి చర్చలు.. మరోవైపు యుద్ధం.. యూస్ వార్ ఫ్లైట్‌ను కూల్చేసిన ఇరాన్

రోడ్డుపై వేగంగా కదిలే స్కూటర్ హ్యాండిల్ వదిలేసి కూర్చుని ఫీట్స్, వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతి ఒక్కరికి కష్టాలు కామన్‌గా ఉంటాయి... కానీ : జగపతి బాబు

PM Modi: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్‌తో వచ్చారు: రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

Vadenaveen: వడ్డే నవీన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల

తర్వాతి కథనం
Show comments