Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గాడిద పాలతో సౌందర్య ఉత్పత్తులు...

గాడిద పాలతో సౌందర్య ఉత్పత్తులు...
, బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (17:52 IST)
'గంగిగోవు పాలు గరిటడైన చాలు... కడవడైననేమి ఖరము పాలు' అనే వేమన రాసిన పద్యాల్లో చదువుకున్నాం. కానీ, హైటెక్ ప్రపంచంలో దీని అర్థం మారిపోతోంది. కొత్త కొత్త పరిశోధన పుణ్యమాని... గాడిద పాలకు ఎంతో గిరాకీ ఏర్పడింది. ఫలితంగా ఈ పాల ధర చుక్కలకు పెరిగింది. దీనికి కారణం.. గాడిద పాలను వివిధ రకాల సౌందర్య ఉత్పత్తుల్లో ఉపయోగించడమేకాకుండా, పలు రకాల వ్యాధులను నయం చేయడానికి కూడా ఉపయోగిస్తున్నారు. ఫలితంగా ఈ పాలకు భలే గిరాకీ ఏర్పడింది. 
 
నిజానికి గాడిద పాలలో ఆరోగ్యానికి ఉపకరించే ఎన్నో విశేష గుణాలున్నాయి. జన్యుపరమైన, వైరల్ సంబంధిత సమస్యలకు గాడిద పాలు చక్కని పరిష్కారాన్ని చూపుతున్నాయి. చంటిబిడ్డలకు మాటలు రాకపోయినా గాడిద పాలను తాపిస్తుంటారు. ఇలా రకాలుగా ఉపయోగిస్తున్నారు.
 
ఇపుడు గాడిద పాలతో ఔషధాలేకాకుండా బ్యూటీ ఉత్పత్తులను కూడా రూపొందిస్తున్నారు. కేరళ, మహారాష్ట్రలలో ఈ పాలతో చేకూరే ప్రయోజనాలపై నిర్వహించిన ప్రయోగాలు మంచి ఫలితాలనిచ్చాయి. గాడిద పాలను తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని తేలింది. దగ్గు, జలుబు, ఆస్తమా, గొంతు ఇన్ఫెక్షన్, టీబీ తదితర వ్యాధుల నివారణలో గాడిదపాలు ఉపకరిస్తాయని వెల్లడైంది. 
 
కేరళలోని కొచ్చిన్‌కు చెందిన ఓ కంపెనీ గాడిద పాలతో సౌందర్య ఉత్పత్తులు తయారు చేసి ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. ఈ ఉత్పత్తులకు మంచి గిరాకీ కూడా ఉంది. అలాగే, మహారాష్ట్రలోని షోలాపూర్‌లో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు గాడిద పాలతో బ్యూటీ ప్రొడక్ట్స్ రూపొందిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాలిచ్చే తల్లులు తీసుకోవలసిన జాగ్రత్తలు..?