Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో ఉండే ఈ మూడు పదార్థాలతో రుచికరమైన కేక్ మీ స్వంతం

Webdunia
బుధవారం, 20 మే 2020 (17:24 IST)
అసలే లాక్ డౌన్, ఇంట్లో పిల్లలు చిరుతిళ్లు కోసం నానా హంగామా చేస్తుంటారు. ఎలాగూ బయట పదార్థాలను కొనాలంటే భయం. కాబట్టి ఇంట్లో వుండే పదార్థాలతో స్వీట్ కేక్ చేసుకుంటే పిల్లలు చక్కగా తినేస్తారు. ఎలా చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు
బోర్బన్ బిస్కెట్స్ - 2 ప్యాకెట్‌లు
పాలు - 1 కప్పు
బేకింగ్ పౌడర్ - 1 టేబుల్‌స్పూన్
పెరుగు - 1 టేబుల్‌స్పూన్
 
తయారీ విధానం
ముందుగా ప్రెషర్ కుక్కర్‌లో సరిపోయే చిన్న పాత్రను తీసుకుని, లోపలి భాగమంతా నూనె పూయండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే, దాన్ని వేసి మళ్లీ నూనె పూయండి. ఇప్పుడు ప్యాకెట్ నుండి బిస్కెట్‌లు తీసుకుని, చిన్న చిన్న ముక్కలు చేసి, మిక్సర్‌లో వేసి ఫైన్ పౌడర్‌గా చేయండి. 
బిస్కెట్ పొడిని ఒక పాత్రలో తీసుకుని, అందులో పాలు కలుపుతూ పేస్ట్‌లా చేయండి. ఆ తర్వాత బేకింగ్ పౌడర్ మరియు పెరుగు వేసి బాగా కలిపి పేస్ట్‌లా చేయండి. నూనె పూసిన పాత్రలో ఈ పేస్ట్‌ను వేసి, పాత్రను ప్రెషర్ కుక్కర్‌లో పెట్టి 10 నుండి 20 నిమిషాలు బేక్ చేయండి. ఆ తర్వాత ఆఫ్ చేసి, పది నిమిషాలు వేచి ఉండండి. పూర్తిగా బేక్ అయ్యినట్లు నిర్ధారించుకుని, బాగా చల్లారిన తర్వాత దాన్ని ఒక ప్లేట్‌లో తీసుకోండి. ఎంతో సాఫ్ట్‌గా ఉండే చాక్లెట్ కేక్ రెడీ.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments