మహాశివరాత్రి స్పెషల్: అటుకుల పాయసం ఎలా చేయాలి?

గురువారం, 20 ఫిబ్రవరి 2020 (19:01 IST)
Atukula payasam
మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం వుండే చాలామంది అటుకులతో చేసిన పాయసాన్ని కాసింత తీసుకోవచ్చు. అలాగే స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. అందుకే మహాశివరాత్రిని పురస్కరించుకుని అటుకుల పాయసాన్ని సులభంగా ఎలా చేయాలో చూద్దాం..
 
కావలసిన పదార్థాలు
పాలు: అర లీటరు
వెన్న : పావు కప్పు 
అటుకులు : వంద గ్రాములు 
జీడిపప్పు : పది గ్రాములు 
ఎండు ద్రాక్షలు : పది గ్రాములు
ఏలకుల పొడి : ఒక స్పూన్ 
కొబ్బరి తురుము : ఒక కప్పు 
బెల్లం తురుము : అర కేజీ 
బాదం పప్పు :  పది గ్రాములు 
 
తయారీ విధానం:
ముందుగా ఒక బౌల్‌లో పాలను పోసి మరిగించాలి. తర్వాత అందులో బెల్లం తురుము వేసి బాగా కలపాలి. అందులో అటుకులు వేసి సుమారు పావుగంట సేపు ఉడికించాలి. అంతలోపు మరో చిన్నపాటి పాన్‌లో నెయ్యి వేసి కరిగిన తర్వాత జీడిపప్పు, కిస్‌మిస్, బాదంపప్పు వేసి వేయించి ఉడుకుతున్న అటుకుల పాయసంలో కలిపేయాలి. ఆపై దించే ముందు ఏలకుల పొడి వేసి బాగా కలపాలి. అంతే అటుకుల పాయసం రెడీ.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం జీడిపప్పులు తింటే బరువు పెరుగుతారా?