Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 27 April 2025
webdunia

జీడిపప్పులు తింటే బరువు పెరుగుతారా? (video)

Advertiesment
Cashew
, గురువారం, 20 ఫిబ్రవరి 2020 (18:44 IST)
Cashew nuts
జీడిపప్పు ప్యాకెట్లు బ్యాగులో వేసుకుని సమయం దొరికినప్పుడల్లా అలా నాలుగేసి నమిలేస్తున్నారా? తిన్నాక బరువు పెరిగిపోతామేమోనని అనుమానం వుందా? అయితే ఈ కథనం చదవాల్సిందే. జీడిపప్పులో విటమిన్ సి, థయామిన్, విటమిన్ బి6, మెగ్నీషియం, జింక్, కాపర్, ఐరన్, పొటాషియం వంటి ధాతువులు వున్నాయి. జీడిపప్పులో హార్మోన్లను క్రమబద్ధీకరించే గుణం వుంది. 
 
జీడిపప్పులో మెటబాలిజంను సక్రమపరిచి.. ఆరోగ్యంగా వుండేలా చేస్తుంది. ఇందులో పీచు పదార్థాలు ఆకలి వేసేలా చేయవు. అందుకే రోజు మొత్తం జీడిపప్పును స్నాక్స్‌గా తీసుకుంటేనే ఆకలిని పక్కనబెట్టేయవచ్చు. ఇందులోని కాపర్, ఐరన్ రక్తకణాల సంఖ్యను పెంచుతుంది. వ్యాధినిరోధకత పెరుగుతుంది. ఆరోగ్యకరమైన ఎముకలకు జీడిపప్పులు బలాన్నిస్తాయి. ఇందులోని లుటిన్ అనే పదార్థం కంటికి మేలు చేస్తుంది. కంటిపై పొరను పేరనీయకుండా చేస్తుంది. 
 
రోజుకు గుప్పెడు జీడిపప్పులు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. జీడిపప్పుతో పాటు వాల్‌నట్స్, బాదం, ఎండు ద్రాక్షలు, పండ్లు వంటివి తీసుకోవచ్చు. జీడిపప్పులతో బరువు పెరిగే అవకాశం లేదని న్యూట్రీషియన్లు చెప్తున్నారు. అంతేకాదు.. బరువు కూడా తగ్గుతారు. మహిళలు, పురుషులు రోజును నాలుగు గ్రాముల మేర జీడిపప్పుల్ని తీసుకుంటే ఆకలి ఎక్కువగా వేయకపోవడం ద్వారా బరువును నియంత్రించుకోగలుగుతారు. తద్వారా ఒబిసిటీ భయం వుండదు. 
 
కానీ ఉప్పులో వేయించిన జీడిపప్పును తీసుకోకపోవడం మంచిది. దీనికి బదులు వట్టి జీడిపప్పులను దోరగా వేయించి తీసుకోవచ్చు. మాంసాహారం కంటే స్నాక్స్‌గా జీడిపప్పును తీసుకుంటే.. శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు సులభంగా అందుతాయి. కాబట్టి జీడిపప్పును తీసుకుంటే బరువు పెరగరు.

రోజుకు గుప్పెడు జీడిపప్పులు తీసుకుంటే చాలు.. బరువు ఇట్టే తగ్గిపోతారని న్యూట్రీషియన్లు చెప్తున్నారు. అది మోతాదుకు మించకూడదని వారు సెలవిస్తున్నారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉదయం టీ, కాఫీలకు బదులు ఒక గ్లాసుడు మజ్జిగ తీసుకుంటే?