Webdunia - Bharat's app for daily news and videos

Install App

వింబుల్డన్‌లో సత్తా చాటిన సానియా మీర్జా.. టోక్యో ఒలింపిక్స్‌లో అరుదైన రికార్డ్

Webdunia
గురువారం, 1 జులై 2021 (22:13 IST)
sania mirza
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రతిష్టాత్మక వింబుల్డన్‌లో సత్తా చాటింది. వింబుల్డన్ మహిళల డబుల్స్ విభాగం తొలి రౌండ్లో గెలుపును నమోదు చేసుకుంది. ఆరో సీడ్ అయిన డిసారై మరియు అలెక్సా గురాచీలపై సానియా జోడీ 7-5, 6-3 పాయింట్ల తేడాతో విజయం సాధించి రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది.

అమెరికా పార్ట్‌నర్ బెథానీతో కలిసి గురువారం జరిగిన తొలి రౌండ్లో మెరుగ్గా ఆడింది. ఫలితంగా తొలి డబుల్స్ రౌండ్ ఇండో-అమెరికా జోడీ వశమైంది. ఈ మ్యాచ్‌ను ఒక గంటా 27 నిమిషాల్లో సొంతం చేసుకుంది సానియా జోడీ. 
 
ఇకపోతే.. సానియా మీర్జా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. టోక్యో ఒలింపిక్స్ 2020​తో భారత్​ తరఫున నాలుగు ఒలింపిక్స్​ల్లో పాల్గొన్న తొలి మహిళా అథ్లెట్​గా సానియా మీర్జా నిలవనుంది.

జూలై 23 నుంచి ప్రారంభం కానున్న ఈ సమ్మర్ గేమ్స్ కోసం సిద్ధమవుతున్న ఈ భారత టెన్నిస్ స్టార్.. మైదానంలోనే కాకుండా బయట కూడా కష్టపడుతున్నానని చెప్పింది. కోర్టులో చురుకుగా కదిలేందుకు చాలా కసరత్తులు చేస్తున్నట్లు తెలిపింది. అంకితా రైనాతో కలిసి సానియా.. టోక్యో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగుతోంది.
 
2018లో ఇజాన్​కు జన్మనిచ్చాక గతేడాది జనవరిలో హోబర్ట్ ఇంటర్నేషనల్ టైటిల్​ గెలిచి సెకండ్​ ఇన్నింగ్స్​ను ఘనంగా ప్రారంభించింది సానియా. ఈ వారమే జరిగిన ఈస్ట్​బోర్న్​ ఇంటర్నేషనల్​ ఈవెంట్​లో తొలి రౌండ్​లోనే సానియా నిరాశపరిచింది. బెతాని మ్యాటెక్‌ సాండ్స్‌ (అమెరికా)తో జతకట్టిన హైదరాబాదీకి తొలి రౌండ్‌లోనే చుక్కెదురైంది. ప్రస్తుతం వింబుల్డన్, ఒలింపిక్స్​లపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే వింబుల్డన్ తొలి డబుల్స్ రౌండ్లో గెలుపును నమోదు చేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

తర్వాతి కథనం
Show comments