Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్ల్యూటీసీ ఫైనల్లో చేతులెత్తేశాయ్.. పెళ్లాంతో ఫోటోలా..? బుమ్రాపై ట్రోలింగ్

Webdunia
గురువారం, 1 జులై 2021 (22:02 IST)
Bumrah_Sanjana
న్యూజిలాండ్‌తో జరిగిన ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత్ 8 వికెట్లతో చిత్తయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బుమ్రా రెండు ఇన్నింగ్స్‌ల్లో ఒక్క వికెట్ తీయలేకపోయాడు. కనీసం ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది కూడా పెట్టలేకపోయాడు. పేస్ బౌలింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై బుమ్రా వైఫల్యం కోహ్లీసేన కొంపముంచింది. 
 
ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా సోషల్ మీడియా వేదికగా తీవ్ర ట్రోలింగ్‌కు గురయ్యాడు. సతీమణి సంజనా గణేశన్‌తో దిగిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న బుమ్రాపై అభిమానులు మండిపడ్డారు. కీలక డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ కనీస పోరాటపటిమ కనబర్చలేకపోయింది. ఇక భారత వైఫల్యానికి ప్రధాన కారణం బుమ్రానే అని భావించిన అభిమానులు అతనిపై పీకలదాక కోపం పెంచుకున్నారు.
  
ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా తన సతీమణితో దిగిన ఫొటోను బుమ్రా షేర్ చేయడం వారికి పుండు మీద కారం చల్లినట్లయింది. దాంతో అభిమానులు ట్రోల్స్‌, మీమ్స్‌తో రెచ్చిపోయారు. అంతేకాకుండా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కూడా బుమ్రా కారణంగానే భారత్ ఓడిపోయిందని గుర్తు చేస్తున్నారు. అతన్ని అనవసరంగా ఆడించారని, బుమ్రా పనైపోయిందని మండిపడుతున్నారు.
 
ఇంకొందరైతే బుమ్రా సతీమణిని టార్గెట్ చేస్తూ ట్రోలింగ్‌కు దిగుతున్నారు. పెళ్లైన నాటి నుంచి జోష్ తగ్గిందంటూ ఫైర్ అవుతున్నారు. ఇక టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌ ముగియడంతో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు సిద్ధమవుతుంది. ఆగస్టు 4 నుంచి మొదటి టెస్టు ప్రారంభం కానుంది.
 
ఆ టెస్ట్ సిరీస్‌కు ఇంకా ఆరు వారాల సమయం ఉంది. అన్ని రోజుల పాటు బయో బుడగలో ఉండటం కష్టం. అంతేకాకుండా ఆటగాళ్లు మానసికంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వారిని ఉల్లాసంగా ఉంచేందుకు మూడు వారాల పాటు టీమిండియా క్రికెటర్లకు విరామం ఇచ్చారు. 
 
బుడగ నుంచి బయటకు వెళ్లి గడిపేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో ఆటగాళ్లంతా ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుమ్రా తన సతీమణితో దిగిన ఫొటోను అభిమానులతో పంచుకొని వారి ఆగ్రహానికి గురయ్యాడు.

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments