Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాక్సింగ్ చేసే స‌త్తా ఇంకా వుంది.. అప్పటివరకు పోరాడుతా : మేరికోమ్

Webdunia
ఆదివారం, 1 ఆగస్టు 2021 (12:32 IST)
టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్ 2020 పోటీల్లో బాక్సింగ్ పోటీల్లో భారత బాక్సర్ మేరీకోమ్ ఓటమిపాలయ్యారు. దీంతో ఆమె స్వదేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఈ ఓటమి తర్వాత బాక్సింగ్‌కు గుడ్‌బై చెప్పేస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. 
 
తనలో బాక్సింగ్ చేసే స‌త్తా ఇంకా ఉంద‌న్నారు. తనకు 40 ఏళ్లు వచ్చేవరకు ఆడుతూనే ఉంటాన‌ని తెలిపారు. త‌దుప‌రి ఒలింపిక్స్‌లోనూ ఆడేందుకు తాను ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తాన‌ని చెప్పారు. 
 
ఒలింపిక్స్‌లో దేశానికి పతకం తీసుకురాలేక‌పోయాన‌ని, ఇందుకు బాధగా ఉంద‌ని చెప్పారు. తాను ఖచ్చితంగా గెలుస్తాన‌ని భావించాన‌ని అన్నారు. తాను బాగానే ఆడిన‌ప్ప‌టికీ ప్రీక్వార్టర్స్‌ మ్యాచ్‌లో న్యాయ నిర్ణేతల తీరు సరిగా లేదని చెప్పారు. 
 
మొద‌టి రెండు రౌండ్లు గెలిచినప్ప‌టికీ తాను ఎందుకు ఓడిపోతానని ప్ర‌శ్నించారు. బౌట్‌కు ముందు అధికారులు త‌న దగ్గరకు వచ్చి సొంత జెర్సీని వాడకూడదన్నారు. తొలి మ్యాచ్‌లో చెప్పని అభ్యంతరం ప్రీక్వార్టర్స్‌లో ఎందుకు చెప్పారని నిల‌దీశారు. త‌న‌ను మానసికంగా దెబ్బతీయడానికే న్యాయ నిర్ణేత‌లు అలా చేశారని భావిస్తున్న‌ట్లు వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments